PAN Card: పాన్‌ కార్డ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? భారీగా జరిమానా చెల్లించక తప్పదు.

|

Dec 20, 2022 | 3:05 PM

పర్మినెంట్ అకౌంట్ నెంబర్‌ (పాన్‌) ఆర్థిక లావాదేవీలు జరపడానికి కచ్చితంగా కావాల్సిన గుర్తింపు కార్డు. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ 10 అంకెల కార్డు ఎన్నో పనులకు ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తికి సంబంధించిన ఆర్థఙక వివరాలన్నీ పాన్‌ కార్డ్‌ ద్వారా తెలుసుకోవచ్చు...

PAN Card: పాన్‌ కార్డ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? భారీగా జరిమానా చెల్లించక తప్పదు.
Pan Card
Follow us on

పర్మినెంట్ అకౌంట్ నెంబర్‌ (పాన్‌) ఆర్థిక లావాదేవీలు జరపడానికి కచ్చితంగా కావాల్సిన గుర్తింపు కార్డు. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ 10 అంకెల కార్డు ఎన్నో పనులకు ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తికి సంబంధించిన ఆర్థిక వివరాలన్నీ పాన్‌ కార్డ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా ఎంతో ముఖ్యపాత్ర పోషించే పాన్‌ కార్డ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. పాన్‌ కార్డ్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? తప్పులు చోటు చేసుకుంటే ఎందుకు జరిమాన చెల్లించాల్సి వస్తుంది లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ను దాఖలు చేసే సమయంలో పాన్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసే సమయంలో ఎవరైనా తప్పుడు పాన్‌ వివరాలను అందిస్తే ఐటీ శాఖ రూ. 10,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఐటీఆర్‌ ఫామ్‌ను ఫిల్ చేసే సమయంలో పాన్‌ వివరాలను సరిగ్గా అందించాల్సి ఉంటుంది. ఇక ఒక వ్యక్తికి రెండు పాన్‌ కార్డులు ఉన్నా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పాన్‌ దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో అందదు, దీంతో వెంటనే మరోసారి అప్లై చేసుకుంటారు. ఇలాంటి సమయాల్లోనే రెండు పాన్‌ కార్డులు కలిగి ఉంటారు. అయితే ఒక వ్యక్తి రెండు పాన్‌ కార్డులు కలిగి ఉండడం నిబంధనలకు వ్యతిరకేం. కాబట్టి రెండో కార్డును సరెండర్‌ చేయాల్సి ఉంటుంది.

రెండో పాన్‌ కార్డ్‌ని ఎలా సరెండర్‌ చేయాలి.?

రెండో పాన్‌ కార్డ్‌ని ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రెండు విధానాల్లోనూ సరెండర్‌ చేయవచ్చు. ఇందుకోసం ఇన్‌కమ్‌ టాక్స్‌ వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మార్పులు/కరెక్షన్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లి ఈ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఈ ఫామ్‌ను నింపి నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజటరీ లిమిటెడ్‌కు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. రెండో పాన్‌కార్డ్‌ను సరెండర్‌ చేసే సమయంలో కార్డును సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌కమ్‌ టాక్స్‌ చట్టం, 1961 సెక్షన్‌ 272బీ ప్రకారం ఒకే వ్యక్తిపై రెండు పాన్‌ కార్డులు ఉంటే రూ. 10,000 వరకు జరిమానా విధిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..