
ప్రస్తుతం కాలంలో జిమ్ వర్కౌట్లు చాలా మంది జీవితాల్లో భాగమయ్యాయి. కానీ, జిమ్ చేస్తూ కొంతమంది గాయపడుతుంటారు. వీరిలో చాలా మందికి హెల్త్ పాలసీ ఉంటుంది. మరి అలాంటి గాయాలకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ లభిస్తుందా? దీనిపై ఇన్సూరెన్స్ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
జిమ్ సంబంధిత గాయాలు సాధారణంగా ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో క్లెయిమ్ రిజక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంపై TATA AIG జనరల్ ఇన్సూరెన్స్ కన్స్యూమర్ అండర్ రైటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ మోసమ్కర్ మాట్లాడుతూ.. సాధారణంగా ఆరోగ్య బీమా కింద జిమ్ సంబంధిత గాయాలకు కవరేజీ ఉంటుంది. కానీ అవి కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి ఉంటాయి. ప్రమాదకరమైన క్రీడలు, మాదకద్రవ్య దుర్వినియోగం లేదా వ్యసనపరుడైన పరిస్థితులకు మాత్రం క్లైయిమ్ రిజక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ విషయంపై జ్యూరిచ్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (అండర్ రైటింగ్ అండ్ ప్రొడక్ట్) పంకజ్ వర్మ మాట్లాడుతూ.. ఆసుపత్రి నోట్స్‌లో స్టెరాయిడ్ దుర్వినియోగం లేదా ఆల్కహాల్ మత్తు గురించి ప్రస్తావించినప్పుడు క్లెయిమ్‌లు రిజక్ట్ అవుతాయి. జిమ్ చేసే సమయంలో హై-రిస్క్ యాక్టివిటీలో భాగంగా గాయమైతే కూడా బీమా సంస్థలు క్లైయిమ్ రిజక్ట్ చేసే అవకాశం ఉంది.
అలాగే ఛాయిస్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రాజేంద్ర ఉపాధ్యాయ మాట్లాడుతూ.. చాలా పాలసీలు జిమ్ సంబంధిత గాయాలను పాలసీ కింద కవర్ చేస్తాయి. కానీ ఆ చర్య వైద్య సలహాకు విరుద్ధంగా ఉంటే, లేదా స్టెరాయిడ్ల దుర్వినియోగం లేదా గుండె జబ్బుతో అతిగా శ్రమించడం వంటి నిర్లక్ష్య ప్రవర్తనను కలిగి ఉంటే, క్లెయిమ్ రిజక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి