
Mukesh Ambani: ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు. అలాగే ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా ఉన్నారు. ముంబైలోని అంబానీ ఇల్లు కూడా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటని అందరికి తెలిసిందే. మీరు ఎప్పుడైనా ముంబైకి వెళ్లి ఉంటే ఈ 27 అంతస్తుల భవనం దూరం నుండి కనిపిస్తుంది. ఈ భవనం దాని పేరు సూచించిన దానికంటే చాలా గొప్పది. కేవలం ఆరు అంతస్తులలో 168 కార్లకు పార్కింగ్ స్థలం ఉంది. ఇంకా ఇది ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన సౌకర్యాలను కలిగి ఉంది. ఈ ఇంటి పేరు ఆంటిలియా. ఇందులో లోపల జిమ్, స్పా, థియేటర్, టెర్రస్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్ నుంచి ఆలయం వరకు ఎన్నో ఉన్నాయి.
నేడు ఆంటిలియా విలువ దాదాపు రూ.15,000 కోట్లు (సుమారు $150 బిలియన్లు). ముంబైలోని కుంబాలా హిల్స్‌లోని ఆల్టమౌంట్ రోడ్‌లో ఉన్న ఆంటిలియా 1,120 ఎకరాల భూమిలో నిర్మించారు. అయితే ప్రస్తుతం ఈ ఇంటి విలువ రూ.50,000 కోట్లకు పైనే ఉండవచ్చని సమాచారం. 2014లో దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా ప్రకటించారు. నిర్మాణం నాలుగు సంవత్సరాలు కొనసాగింది. అంబానీ కుటుంబం 2006లో నిర్మాణాన్ని ప్రారంభం కాగా, 2010లో పూర్తయింది. భూమి నుండి ఎత్తులో ఉండటం వల్ల భూకంపాలను తట్టుకునే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఆంటిలియా రిక్టర్ స్కేల్‌పై 8 వరకు భూకంపాలను తట్టుకోగలదు. కానీ ఆంటిలియా నిర్మించిన భూమిలో ఇంతకు ముందు ఏమి ఉందో మీకు బహుశా తెలియకపోవచ్చు. తెలుసుకుందాం.
ఆంటిలియా స్థలం ఒకప్పుడు ఒక అనాథాశ్రమానికి నిలయంగా ఉండేది. దీనిని 1895లో ధనవంతుడైన కరీంభాయ్ ఇబ్రహీం నిర్మించాడు. ఈ అనాథాశ్రమాన్ని ప్రత్యేకంగా తల్లిదండ్రులు లేని, ఖోజా సమాజానికి చెందిన పిల్లల కోసం రూపొందించారు. ఈ అనాథాశ్రమాన్ని వక్ఫ్ బోర్డు నిర్వహించేది. 2002లో ట్రస్ట్ భూమిని విక్రయించడానికి అనుమతి కోరింది. కొన్ని నెలల తర్వాత ప్రభుత్వ ఛారిటీ కమిషనర్ అనుమతి మంజూరు చేశారు.
ఇది కూడా చదవండి: Bike Servicing: ప్రతి 2000 కి.మీ.కి బైక్ సర్వీసింగ్ ఎందుకు చేయించాలి? ఆలస్యమైతే జరిగే నష్టాలివే!
ఇది కూడా చదవండి: Asha Chocolate: ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ‘ఆశ చాక్లెట్’ ఇప్పుడు ఎందుకు కనుమరుగైపోయింది? అసలు కారణాలివే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి