Indian Railways: ఎంత వర్షం పడ్డా రైల్వే ట్రాక్‌లు ఎందుకు తుప్పు పట్టవో తెలుసా.? కారణం ఏంటంటే..

|

Oct 17, 2023 | 8:29 PM

అయితే రైల్వే ట్రాక్‌లు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలనైనా తట్టుకోగలవు. వర్షం, సూర్యకాంతి, మంచు వంటి అన్ని పరిస్థితులను సైతం తట్టుకుంటాయి. సాధారణంగా అయితే ఇనుముతో తయారు చేసే ఏ వస్తువైనా తప్పు పడుతుంది. కానీ రైల్వే ట్రాక్‌లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తుప్పు పట్టవు. మరి ఇనుముతో తయారు చేసే ట్రాక్‌లు ఎందుకు తుప్పు పట్టవు.? అసలు దీని వెనకాల ఉన్న కారణం ఏంటి.?

Indian Railways: ఎంత వర్షం పడ్డా రైల్వే ట్రాక్‌లు ఎందుకు తుప్పు పట్టవో తెలుసా.? కారణం ఏంటంటే..
Railway Track
Follow us on

ఇండియన్‌ రైల్వేకు సంబంధించిన ప్రతీ చిన్న అంశం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థల్లో ఒకటైన భారతీర రైల్వే ఎన్నో విశేషాలకు నెలవు. ఇక ఇండియన్‌ రైల్వేకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాల్లో రైల్వే ట్రాక్‌ ఒకటి. అత్యంత బరువైన రైళ్లను ఈ ట్రాక్‌లు చాలా సులభంగా మోయగలవు. ప్రయాణికులతో పాటు వస్తువులను గమ్య స్థానాకుల చేర్చుతాయి.

అయితే రైల్వే ట్రాక్‌లు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలనైనా తట్టుకోగలవు. వర్షం, సూర్యకాంతి, మంచు వంటి అన్ని పరిస్థితులను సైతం తట్టుకుంటాయి. సాధారణంగా అయితే ఇనుముతో తయారు చేసే ఏ వస్తువైనా తప్పు పడుతుంది. కానీ రైల్వే ట్రాక్‌లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తుప్పు పట్టవు. మరి ఇనుముతో తయారు చేసే ట్రాక్‌లు ఎందుకు తుప్పు పట్టవు.? అసలు దీని వెనకాల ఉన్న కారణం ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఇనుముతో తయారు చేసిన వస్తువులు తేమతో కూడిన గాలిలో ఆక్సిజన్‌తో చర్య జరుగుతుంది. ఇనుముపై నీరు పడితే గోధుమ రంగులో ఐరన్ ఆక్సైడ్‌ పొర ఏర్పడుతుంది. ఆక్సిజన్‌తో ఇనుముతో జరిగే ప్రతిచర్య వల్ల గోధుమ రంగు పూత ఏర్పడుతుంది. ఈ పొర ఏర్పడడానికి ప్రధాన కారణం ఆక్సిజన్‌, కార్బన్‌డయాక్సైడ్‌, సల్ఫర్‌, ఆమ్లం వంటి సమీకరణం ద్వారా ఏర్పడుతుంది. అయితే ఆక్సిజన్‌ లేనప్పుడు ఇనుముకు తుప్పు పట్టదు.

రైల్వే ట్రాకులను తయారు చేయడానికి ప్రత్యేక రకైన ఉక్కును ఉపయోగిస్తారు. ట్రాక్‌ల తయారీలో కూడా ఇనుమునే పయోగిస్తారు. అయితే ఈ రైల్వే ట్రాక్‌లో స్టీల్‌, మాంగనీస్‌ వంటివి కలిపి తయారు చేస్తారు. మాంగసీస్‌ స్టీల్ అనేది ఉక్కు, మాంగనీస్‌తో తయారు చేస్తారు. ఇందులో 12 శాతం మాంగనీస్‌, 1 శాతం కార్బన్‌ ఉంటుంది. దీని కారణంగా ట్రాక్‌లపై ఆక్సీకరణ జరగదు. అందుకే రైల్వే ట్రాక్‌లు తుప్పుపట్టవు. సాధారణ ఇనుముతో తయారు చేస్తే గాలిలో తేమ కారణంగా తుప్పు పడుతుంది.

దీని కారణంగా రైల్వే ట్రాక్‌ల నాణ్యత దెబ్బతింటుంది. వెరసి రైల్వే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇనుము తుప్పు పడితే పదే పదే ట్రాక్‌లను మార్చాల్సి ఉంటుంది. ఇది ఖర్చు, సమయంతో కూడుకున్న విషయం. అందుకే రైల్వే ట్రాక్‌లకు ప్రత్యేకమైన ఇనుమును ఉపయోగిస్తారు. రైల్వే ట్రాక్‌లలో కార్బన్‌ పరిమాణం తక్కువగా ఉంటుంది. ట్రాక్స్‌ తుప్పు పట్టకపోవడానికి ప్రధాన కారణం ఇదే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..