Telugu News Business Do you have two PAN cards, Apart from the fine, those punishments are not exempted, Double Pan Card details in telugu
Double Pan Card: మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా..? జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ముఖ్యంగా పాన్ కార్డు డబ్లింగ్‌ను నిరోధించడానికి ఈ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు లింక్ చేయకపోతే పాన్ కార్డును ఇన్ యాక్టివ్ చేస్తుంది. అయితే ఒకటి కంటే ఎక్కువ పాన్లను కలిగి ఉంటే జరిమానాలు, ఆదాయపు పన్ను విషయాలలో సంక్లిష్టతలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు తప్పనిసరి చేసింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ముఖ్యంగా పాన్ కార్డు డబ్లింగ్‌ను నిరోధించడానికి ఈ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు లింక్ చేయకపోతే పాన్ కార్డును ఇన్ యాక్టివ్ చేస్తుంది. అయితే ఒకటి కంటే ఎక్కువ పాన్లను కలిగి ఉంటే జరిమానాలు, ఆదాయపు పన్ను విషయాలలో సంక్లిష్టతలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాన్‌ను ఆధార్, బ్యాంక్ ఖాతాలతో లింక్ చేయడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఆదాయపు పన్ను శాఖకు బహుళ పాన్లను సులభంగా గుర్తించేలా చేస్తాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ పాన్ కార్డులు ఉండడం వల్ల కలిగే ఇబ్బందులతో పాటు వాటిని ఎలా బ్లాక్ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.
ఆదాయప పన్ను చట్టంలో ఇలా
1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏ ప్రకారం, ఒక వ్యక్తికి ఒక పాన్ మాత్రమే అనుమతించబడుతుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే సెక్షన్ 272బీ ప్రకారం జరిమానాలు విధించవచ్చు.