ఆధార్ ఆధారిత ఓటీపీను ఉపయోగించి ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) యాక్టివేట్ చేసుకునేలా చర్యలు తీసుకోవాాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ను ఆదేశించింది. యూనియన్ బడ్జెట్ 2024-25లో ప్రకటించిన ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) స్కీమ్ నుంచి గరిష్ట సంఖ్యలో యజమానులు, ఉద్యోగులు ప్రయోజనం పొందేలా చేయడం దీని లక్ష్యమని పేర్కొంది. నవంబర్ 30, 2024 నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన వారి ఉద్యోగులందరికీ ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను యజమానులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
యూఏఎన్ యాక్టివేషన్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓకు సంబంధించిన సమగ్ర ఆన్‌లైన్ సేవలకు అన్‌లిమిటెడ్ యాక్సెస్‌ను అందిస్తుంది. వారి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పీఎఫ్ పాస్‌బుక్‌లను వీక్షించడం, డౌన్‌లోడ్ చేయడం, ఉపసంహరణలు, అడ్వాన్స్‌లు లేదా బదిలీల కోసం ఆన్‌లైన్ క్లెయిమ్‌లను సమర్పించడం, వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేయడం, రియల్ టైమ్ క్లెయిమ్‌లను ట్రాక్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఉద్యోగులకు 24/7 ఈపీఎఫ్‌ఓ సేవలను పొందడానికి యాక్సెస్ ఇస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి