ICICI HFC: మీ డ్రీమ్ హౌస్ కొనడానికి గృహ రుణం కోసం ఎదురుచూస్తున్నారా.. కానీ మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) నిరూపణ పత్రాలు లేవా? ఇప్పుడు మరేం పర్వాలేదు. ఇలాంటి వారి కోసం ఐసిఐసిఐ సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఐటిఆర్ దాఖలు చేయని వారికి అండగా ఉండేందుకు ఐసిఐసిఐ హోం ఫైనాన్స్ (ఐసిఐసిఐ హెచ్‌ఎఫ్‌సి) కీలక ప్రకటన విడుదల చేసింది. గృహ రుణాలు పొందేందుకు ఉన్న నిబంధనలను సడలిస్తూ ప్రకటించింది.
“వడ్రంగులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, టైలర్లు, పెయింటర్లు, వెల్డర్లు, ఆటో మెకానిక్స్, ఆటో టాక్సీ డ్రైవర్లు, చిన్న కూరగాయల వ్యాపారులు, కిరాణా షాప్ యజమానులు, చిరు ఉద్యోగులు, ల్యాప్‌టాప్/కంప్యూటర్/ఆర్ఓ రిపేర్ టెక్నీషియన్లు, కార్మికులు, అలాగే ఆదాయపు పన్ను రిటర్న్ పత్రాలు లేని చిన్న, మధ్యతరహా వ్యాపార యజమానులు.. తమ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, గత ఆరు నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లను బ్రాంచ్‌లో సమర్పించడం ద్వారా ఐసిఐసిఐ హెచ్‌ఎఫ్‌సి కింద స్పాట్ హోమ్‌లోన్ పొందవచ్చు.’’ అని ఐసిఐసిఐ హోం ఫైనాన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
గృహ రుణాలు అవసరమైన కస్టమర్లు ఐసిసిఐ హెచ్ఎఫ్‌సి ఉద్యోగులను సంప్రదించవచ్చునని పేర్కొంది. వారు.. ఇఎంఐ చెల్లింపులకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తారని ఐసిఐసిఐ తెలిపింది. మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటెన్ చేయడానికి అవరమైన సూచనలు, సలహాలు కూడా ఇస్తారంది.
“బిగ్ ఫ్రీడమ్ మంత్‌లో భాగంగా గృహ రుణాల కోసం మా ఆన్-ది-స్పాట్ హోమ్ లోన్ ద్వారా బహుళ గృహ రుణ సమర్పణలను అందిస్తుంది. ప్రత్యేక నిపుణుల నేతృత్వంలోని ఉద్యోగుల సంప్రదింపులతో పాటు అనధికారిక విభాగంలో కస్టమర్‌లు తమ కలల గృహాలను కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది” అని ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ ఎండీ, సీఈఓ అనిరుద్ కమాని తెలిపారు. అలాగే.. “మా శాఖలను సందర్శించినప్పుడు, కస్టమర్‌లు వారికున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇంటి యజమాని అవడానికి అవసరమైన ఆర్థిక వనరుల గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ప్రతీ శాఖలో ప్రతినిధులు ఉంటారు. తక్కువ డాక్యుమెంటేషన్‌తో త్వరగా రుణాలు అందించడానికి ఇది వీలు కల్పిస్తుంది.
ఇక ప్రథనా మంత్రి ఆవాస్ యోజన (PMAY), ఆర్థికంగా బలహీనమైన వర్గాలు(EWS). తక్కువ ఆదాయ వర్గాల(LIG) కోసం క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ పథకం (CLSS) కింద మొదటిసారి గృహ కొనుగోలుదారులు రూ .2.67 లక్షల వరకు సబ్సిడీని పొందవచ్చు.
Also read:
Apps for Farmers: ఈ మొబైల్ యాప్‌లతో రైతులకు ఎంతో మేలు.. ఇవి తెలిపే సమాచారం ద్వారానే రైతులకు..
Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..
Andhra Pradesh: ఏళ్లుగా సహజీవనం చేశాడు.. ఆమె కూతురుపైనా కన్నేశాడు.. కాదన్నందుకు కడతేర్చాడు..