డీమార్ట్‌కు ఎక్కువగా వెళ్లేవారు ఇవి తెలుసుకోండి! లేదంటే తీవ్రంగా నష్టపోతారు..

డీమార్ట్‌లో తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయి. కానీ, ఆఫర్‌లు, డిస్కౌంట్లలో జాగ్రత్త అవసరం. పాత వస్తువులు, ముఖ్యంగా ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆన్‌లైన్ షాపింగ్‌లో రిటర్న్ పాలసీని పరిగణలోకి తీసుకోవాలి. కొనుగోలు చేసే ముందు నాణ్యత, ధర, వాపసు విధానాలను తనిఖీ చేయడం చాలా ముఖ్యం.

డీమార్ట్‌కు ఎక్కువగా వెళ్లేవారు ఇవి తెలుసుకోండి! లేదంటే తీవ్రంగా నష్టపోతారు..
Dmart Shopping

Updated on: Sep 07, 2025 | 7:27 PM

డీమార్ట్‌.. మధ్య తరగతి వారికి ఫేమస్‌ స్టోర్లు. ఇంట్లో సరుకులకైనా, గృహోపకరణాలకైనా చాలా మంది డీమార్ట్‌లనే ప్రిఫర్‌ చేస్తుంటారు. ధర తక్కువని, మంచి క్వాలిటీ ఉంటుందని, పైగా అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభిస్తాయని చాలా మంది డీమార్ట్‌కు వెళ్తుంటారు. అందుకే డీమార్ట్‌లు ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెట్రో నగరాల నుంచి చిన్నస్థాయి పట్టణాల వరకు కూడా ఈ డీమార్ట్‌లు విస్తరించాయి. అయితే ఈ డీమార్ట్‌కు ఎక్కువగా వెళ్లేవారు కొన్ని వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం.

వినియోగదారులను ఆకట్టుకునేందుకు డీమార్ట్ పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వీకెండ్స్ లోనూ డిస్కౌంట్‌ ఆఫర్లు పెడుతుంది. కానీ, ఈ ఆఫర్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం.. ఎందుకంటే, ఆఫర్లు, డిస్కౌంట్లు అందించే వస్తువులు, సామాన్లు ఎక్కువగా పాతవి ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్, సౌందర్య సాధనాలు కొనుగోలు చేసే సమయంలో అలర్ట్ గా ఉండాలి.

డీమార్ట్ లో చౌకైన కిరాణా వస్తువులు మాత్రమే కాదు. ఈ సంస్థకు చెందిన యాప్ ద్వారా ఆన్‌ లైన్ లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బ్రాండెడ్ వస్తువులను ఇతర ఆన్‌ లైన్ ప్లాట్‌ ఫామ్‌ లలో పోల్చితే తక్కువ ధరలకు లభిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో Amazon, Flipkartతో పోల్చితే డీమార్ట్ లో ఇంకా తక్కువ ధరలకు లభిస్తాయి.

డిమార్ట్ రిటర్న్ పాలసీ ప్రకారం.. కొన్ని వస్తువులు, ముఖ్యంగా ఆన్‌ లైన్‌ లో కొనుగోలు చేసినవి తిరిగి తీసుకోరు. ఇందులో లోదుస్తులు, సౌందర్య సాధనాలు, వ్యక్తిగత వినియోగ వస్తువులు ఉన్నాయి. అలాంటి వస్తువులను కొనుగోలు చేసే ముందు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది.

డీమార్ట్ లో కొన్ని వస్తువులు, ఉత్పత్తులపై స్టాక్ ఉన్నంత వరకు లేదంటే తక్కువ కాలం వరకు ఆఫర్లు ఉంటాయి. మీరు అలాంటి వస్తువును కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఏదైనా కొనుగోలు చేసే ముందు ఉత్పత్తి నాణ్యత, ధర, వాపసు విధానాన్ని తనిఖీ చేయాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి