Amazon Summer Sale: ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ డిస్కౌంట్..

ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వారందరికీ శుభవార్త. మండు వేసవిలో మీకో చల్లని కబురు. ఎండల కారణంగా ఉక్కబోతతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆన్ లైన్ కామర్స్ దిగ్గజం అమెజాన్ చల్లని విషయం చెప్పింది. వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ ధరలో అందించేందుకు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ను ప్రారంభించింది.

Amazon Summer Sale: ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ డిస్కౌంట్..
Amazon

Updated on: May 03, 2024 | 4:16 PM

ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వారందరికీ శుభవార్త. మండు వేసవిలో మీకో చల్లని కబురు. ఎండల కారణంగా ఉక్కబోతతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆన్ లైన్ కామర్స్ దిగ్గజం అమెజాన్ చల్లని విషయం చెప్పింది. వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ ధరలో అందించేందుకు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ను ప్రారంభించింది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆన్ లైన్ లో కొనుగోళ్లు ప్రారంభించండి.

అమెజాన్ సమ్మర్ సేల్..

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 2వ తేదీ మధ్యాహ్నం నుంచి దేశంలో ప్రారంభమైంది. వివిధ వస్తువులపై భారీగా డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. గతంలో మాదిరిగానే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ముందస్తు అవకాశం కల్పించింది. వారు ఇతరుల కంటే ముందే బెస్ట్ డీల్ లను సొంతం చేసుకోవచ్చు. అర్ధరాత్రి నుంచే ప్రారంభ యాక్సెస్‌ను పొందుతారు. సమ్మర్ సేల్ లో మొబైల్ ఫోన్లు, ఉపకరణాలు, బ్యూటీ, ఫ్యాషన్ వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్లు, స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందజేస్తుంది. ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డులు కలిగిన అమెజాన్ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేకమైన డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంది.

బ్యాంక్ ఆఫర్లు..

ఐసీఐసీఐ, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించే కస్టమర్లకు సేల్ లో సంబంధిత ఉత్పత్తులపై 10 శాతం తగ్గింపు ఉంది.

ఈఎమ్ఐ తగ్గింపులు..

ఈఎమ్ఐ ద్వారా చెల్లింపులను ఎంచుకునే కొనుగోలుదారులు కూడా ఆఫర్ ఉంది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 10 శాతం వరకూ తగ్గింపు ప్రయోజనం పొందవచ్చు.

నోకాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు..

ఈఎమ్ఐ కొనుగోళ్లపై డిస్కౌంట్లతో పాటు సేల్ సమయంలో కస్టమర్లు నో కాస్ట్ ఈఎమ్ఐ ఎంచుకోవడానికి అనుమతి ఉంటుంది.

క్యాష్‌బ్యాక్..

గ్రేట్ సమ్మర్ సేల్ లో కొత్త అమెజాన్ కస్టమర్లు తమ మొదటి కొనుగోలుపై 20 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అంటే వారికి దాదాపు రూ. 100 వరకూ ప్రయోజనం కలుగుతుంది.

ప్రైమ్ షాపింగ్ ఎడిషన్..

బిజినెస్ అమెజాన్ ఖాతాలు కలిగిన వారు సేల్ సమయంలో కేవలం రూ. 399లకే ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. దీనిద్వారా తక్కువ ధరకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.

ముందస్తు యాక్సెస్ అర్హత..

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ మత్రమే కాదు ఇతర అమెజాన్కు సంబంధించిన ఏ సేల్ అయినా ఇతరుల కంటే ముందుగా యాక్సెస్ పొందడానికి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అవసరమవుతుంది. ఇది ఒక సభ్యత్వం లాంటిది. అమెజాన్ ప్రైమ్ ప్లాన్‌లు నెలకు రూ. 299 నుంచి ప్రారంభమవుతాయి. వివిధ వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటాయి.

ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్లు..

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు ఒక నెల, లేదా ఏడాది వ్యాలిడిటీతో లభిస్తాయి. రూ. 299 నుంచి రూ. 1,499 కు అందుబాటులో ఉంటాయి. వీటి వల్ల సేల్ సమయంలో ముందస్తు యాక్సెస్‌ లభిస్తుంది. అలాగే ఉచితంగా వన్ డే డెలివరీ, ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్, ప్రైమ్ గేమింగ్ యాక్సెస్, ప్రైమ్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు.

అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్..

హెచ్ డీ నాణ్యతతో కూడిన ప్రైమ్ వీడియోకు యాక్సెస్‌ను అందిస్తుంది, అలాగే ఉచితంగా డెలివరీ సదుపాయం కల్పిస్తుంది. కానీ ప్రైమ్ గేమింగ్, ప్రైమ్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు ఈ ప్లాన్ లో లభించవు.

అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్..

దుకాణదారుల కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్ ను రూపొందించారు. విక్రయాలకు ముందస్తు యాక్సెస్‌ పొందడంతో పాటు కొనుగోలు చేసిన వస్తువులను అదే రోజు, లేదా ఒక్క రోజు వ్యవధిలో డెలివరీ చేస్తారు. ఇంక ఇతర ప్రయోజనాలు లభించవు.

నమ్మలేని డిస్కౌంట్..

అమెజాన్ సమ్మర్ సేల్ లో ప్రముఖ కంపెనీల మొబైల్‌ ఫొన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌ తదితర వాటిని అందుబాటులో ఉంచారు. మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలపై దాదాపు 45 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. వన్ ప్లస్ (OnePlus), రెడ్ మీ (Redmi), రియల్ మీ (Realme) తదితర స్మార్ట్‌ఫోన్ల ను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని వస్తువులపై..

ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లపై ఏకంగా 75 శాతం వరకూ, టీవీలు, ఉపకరణాలపై 65 శాతం వరకూ తగ్గింపు ఉంది. సోనీ డబ్ల్యూహెచ్ 1000XM4 వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు, అమాజ్‌ఫిట్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్, ఆపిల్ ఐప్యాడ్ (10వ తరం) వంటి వాటిపై భారీ డిస్కౌంట్ ఉంది. హోమ్, కిచెన్ ప్రాడెక్ట్స్ పై 70 శాతం, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై 50 నుంచి 80 శాతం వరకూ తగ్గింపు అందిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..