Flipkart Festival Offers: దీపావళి పండగ సీజన్‌లో ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక దీపావళి ముందు అంటే నవంబర్ 2వ తేదీన ధంతేరాస్ రానుంది. దంతేరాస్ సందర్భంగా అనేక వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఆ రోజు ఏదైనా వస్తువులను కొనుగోలు చేస్తే మంచిదని ప్రగాఢ విశ్వాసం. ఇతర పండగల సందర్భాలలో ఈ ధంతేరాస్ (ధన త్రయోదశి) ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజున కొత్త వస్తువులను ముఖ్యంగా బంగారం, ఆటోమోబైల్స్, ఇతర ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తుంటారు. ఈ ధంతేరాస్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్టు పలు ఆఫర్లను ప్రకటించింది. అదే అవకాశాన్ని క్యాష్ చేసుకుంటూ ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్ ఇప్పటికే ప్రారంభించింది. అక్టోబర్ 28న ప్రారంభమైన ఈ సేల్ నవంబర్ 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీలు, గృహోపకరణాలు, దుస్తులు, గృహాలంకరణ, ఫర్నీచర్, పుస్తకాలు ఇతర వాటిపై ఆఫర్లను ప్రకటించింది.
స్మార్ట్‌టీవీలు: ఇక స్మార్ట్‌టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీగానే తగ్గింపు ఆఫర్లు అందిస్తోంది. ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ క్రేజీ డీల్స్ కూడా సేల్ సమయంలో కొనసాగిస్తోంది. అలాగే పండగ సీజన్‌లో ఆపిల్, శాంసంగ్, షియోమీ, ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై, అలాగే టాబ్లెట్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అలాగే దీపావళి సేల్ సందర్భంగా ఇతర ఉత్పత్తులపై 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లో స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో యాక్సెసరీలపై 80 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. డెస్క్‌టాప్‌లపై 30 శౄతం, పవర్ బ్యాంక్‌లపై 75 శాతం, హెడ్‌ఫోన్స్, స్పీకర్లపై 70 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఇక వివిధ ఫ్యాషన్ బ్రాండ్‌లపై 60 నుంచి 80 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది.
ఫర్నీచర్స్: ఇక ఫర్నీచర్స్, పరుపు వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపుతో పాటు ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఉచిత డెలివరీ సదుపాయం ఉంది. ఇందులో నో కాస్ట్ ఈఎంఐ అందిస్తోంది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
ఇవి కూడా చదవండి: