Flight Ticket Rules: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రీఫండ్ రూల్స్‌లో మార్పులు.. 48 గంటల్లోపు క్యాన్సిల్ చేస్తే..

విమాన ప్రయాణికులకు డీజీసీఏ శుభవార్త అందించింది. ఇండిగో సంక్షోభం క్రమంలో ప్రయాణికులు రీఫండ్ పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. చాలామందికి సకాలంలో రీఫండ్ లభించలేదు. ఈ క్రమంలో డీజీసీఏ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రయాణికులకు ఉపయోగపడేలా క్యాన్సిలేషన్ రూల్స్ మార్చింది.

Flight Ticket Rules: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రీఫండ్ రూల్స్‌లో మార్పులు.. 48 గంటల్లోపు క్యాన్సిల్ చేస్తే..
Flight

Updated on: Feb 26, 2026 | 7:15 PM

విమాన ప్రయాణికులకు శుభవార్త. ఫ్లైట్ టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ రూల్స్ మారాయి. ఈ మేరకు ఇప్పటివరకు ఉన్న నిబంధనల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక మార్పులు చేసింది. విమాన టికెట్లను ప్రయాణికులు రద్దు చేసుకునే సమయంలో టికెట్ రీఫండ్‌కి సంబంధించిన నియమాలను డీజీసీఏ సవరించింది. ఇక నుంచి ప్రయాణికులు ఫ్లైట్ బయల్దేరే షెడ్యూల్ సమాయానికి 48 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. విమానాల రద్దు, షెడ్యూల్స్‌లో మార్పులు జరిగినప్పుడు ప్రయాణికులు నష్టపోకూడదనే కారణంతో రీఫండ్ నిబంధనలను సవరిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

క్యాన్సిలేషన్ నిబంధనలు మార్పు

-ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాక 48 గంటల్లోపు క్యాన్సిల్ చేసుకోవచ్చు.. ఇందుకు ఎటువంటి ఎక్స్‌ట్రా చార్జీలు చెల్లించాల్సిన అవసం లేదు

-విమానయాన సంస్థలు 14 రోజుల్లోపు రీఫండ్ ప్రాసెస్ పూర్తి చేయాలి

-టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల్లోపు సాధారణ పేరు మార్చుకునేందుకు ఎలాంటి ఛార్జ్ విధించకూడదు

-ఎయిర్‌లైన్ సొంత వెబ్ సైట్, యాప్‌ల ఆధారంగా చేసుకున్న బుకింగ్స్‌కు ఈ రూల్స్ వర్తిస్తాయి

-ఇక ట్రావెల్ ఏజెంట్లు, థర్డ్ పార్టీ పోర్టల్స్ ద్వారా టికెట్లు కొనుగోలు చేస్తే 14 పని దినాల్లోపు రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది

మార్పులు ఎందుకంటే..

ఇటీవల ఇండిగో సంక్షోభం క్రమంలో వేలాది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రీఫండ్ రావడంలో జాప్యం జరగడంతో ప్రయాణికులు నష్టపోయారు. ఈ క్రమంలో విమానయాన సంస్థలు రీఫండ్స్ సరిగ్గా ఇవ్వడం లేదంటూ డీజీసీఏకి చాలామంది ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో డీజీసీఏ ఈ కొత్త రీఫండ్ నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇవి ప్రయాణికులు సులభంగా రీఫండ్ పొండటంలో ఉపయోగపడనున్నాయి. 48 గంటల్లోపు క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండకపోవడం వల్ల ప్రయాణికులు ప్రణాళికలను పునరాలించుకోవడానికి స్వల్ప గ్రేస్ పీరియడ్ పొందుతారు. ఇక టికెట్లలో పేర్ల స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే 24 గంటల్లోపు ఎలాంటి అదనపు ఛార్జీలు తీసుకోకుండా ప్రయాణికులకు అవకాశం కలగనుంది. ఇది కూడా దేశంలోని విమాన ప్రయాణికులకు ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు. గత ఏడాది డిసెంబర్‌లో ఇండిగో సంక్షోభం తర్వాత డీజీసీఏ ఈ నిర్ణయాలు అమల్లోకి తెచ్చింది. ఆ సంక్షోభం నుంచి ఎదుర్కొన్న పాఠాలతో ప్రయాణికులకు ఉపయోగపడేలా ఈ కొత్త రూల్స్ తీసుసుకొచ్చింది. ఇప్పటివరకు ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఛార్జీలు విధించేవారు. ఇప్పటినుంచి ఇక ఎలాంటి ఛార్జీలు ఉండవు.

Follow Us