జస్ట్ 4:30 గంటలే 1,170 కిలో మీటర్ల ప్రయాణం.. ఈ నగరాల మధ్య మరో హైస్పీడ్ బుల్లెట్‌ ట్రైన్!

ఢిల్లీ-పాట్నా మధ్య ప్రయాణించే వారికి కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ రూట్‌లో దేశంలోనే రెండో హైస్పీడ్‌ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తోంది.ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 1170 కి.మీ. దూరాన్ని ప్రస్తుతం 12 గంటల నుండి కేవలం 4 గంటల 30 నిమిషాలకు తగ్గించనుంది. ఇది ప్రయాణికులకు చాలా వరకు సమయాన్ని ఆదా చేయనుంది.

జస్ట్ 4:30 గంటలే 1,170 కిలో మీటర్ల ప్రయాణం.. ఈ నగరాల మధ్య మరో హైస్పీడ్ బుల్లెట్‌ ట్రైన్!
Delhi Patna Bullet Train

Updated on: Sep 04, 2026 | 7:34 PM

ఢిల్లీ- పాట్నా మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ రూట్‌లో అత్యాధునిక హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్‌ నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది రైల్వేశాఖ. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తదుపరి హై-స్పీడ్ కారిడార్‌గా ఢిల్లీ-పాట్నా మార్గం నిలవనుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఢిల్లీ నుంచి పాట్నాకు ట్రైన్‌లో వెళ్లాలంటే సుమారు 12 గంటల కంటే ఎక్కువ సమయమే పడుతోంది. దీంతో ప్రయాణికులు దాదాపు సగం రోజులు ఇక్కడే గడిచిపోతుంది. అయితే, ఇప్పుడు కొత్తగా నిర్మించబోయే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ గనుక పూర్తయితే ఈ 1,170 కిలోమీటర్ల ఈ దూరాన్ని కేవలం 4 గంటల 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నార్త్ ఇండియాలో కీలక చారిత్రక, పారిశ్రామిక నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా వరకు తగ్గనుంది.

మన స్టేషన్‌ వారిగా ఈ ట్రైన్‌ జర్నీ సమయాన్ని అంచా వేస్తే.. ఢిల్లీలో స్టార్ట్ అయిన ఈ ట్రైన్ ఆగ్రా చేరుకోవడానికి 58 నిమిషాలు పడుతుంది. అదే కాన్పూర్‌కు 1 గంట 50 నిమిషాల్లో చేరుకుంటుంది. ఇక లక్నోకు 2 గంటల 12 నిమిషాల్లో రీచ్ అవుతుంది. ప్రయాగ్‌రాజ్ చేరుకోవడానికి 3 గంటలు సమయం పడుతుంది. వారణాసి వచ్చేసరికి 3 గంటల 33 నిమిషాలు అవుతుంది. ఇక చివరి స్టైషనైనా పాట్నాకు చేరుకోవడానికి 4 గంటల 30 నిమిషాలు సమయం పడుతుంది.

అయితే ఈ రూట్‌లో బుల్లెట్ ట్రైన్ ఎప్పటిలోపు పూర్తి అవుతుందనే మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ మెగా ప్రాజెక్ట్ ప్రాథమిక ప్రణాళిక, సర్వే దశల్లో ఉందని.. సమగ్ర మార్గ నిర్ధారణ, డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, భూసేకరణ ప్రక్రియలు పూర్తి కాగానే అధికారిక నిర్మాణ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్న టైంకి పూర్తయితే ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us