September 2, 2026
Subhash
ప్రమాదం అనేది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. అలాంటి సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు SBI వ్యక్తిగత ప్రమాద బీమా పథకం ఉపయోగపడొచ్చు.
ఏడాదికి రూ.3,000 ప్రీమియం చెల్లించడం ద్వారా గరిష్ఠంగా రూ.60 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీ పొందే అవకాశం ఉంది.
ఈ పాలసీలో ప్రత్యేకంగా వెయిటింగ్ పీరియడ్ ఉండదని పేర్కొంటున్నారు. ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీ నిబంధనల ప్రకారం కవరేజీ ప్రారంభమవుతుంది.
ప్రమాద బీమాతో పాటు మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పిల్లల విద్య కోసం రూ.20,000, అంత్యక్రియల ఖర్చులకు రూ.10,000, , దత్తత కోసం రూ.10,000 వరకు, అంబులెన్స్ ఖర్చులకు కవరేజీ.
పాము కాటు, విద్యుత్ షాక్ వంటి ప్రమాదాలకు కూడా పాలసీ నిబంధనల ప్రకారం కవరేజీ లభించవచ్చు. అయితే ఆత్మహత్యకు బీమా వర్తించదు.
2 చేతులు, 2 కాళ్లు, 2 కళ్లను కోల్పోయినట్లయితే రూ.60 లక్షల వరకు పూర్తి బీమా మొత్తం లభించే అవకాశం ఉంది. ఒక చేయి లేదా ఒక కాలు వంటి శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.30 లక్షల వరకు.
ఈ పథకం SBI ఖాతాదారులకు అందుబాటులో ఉంటుంది. వయస్సు: 18 నుంచి 65 సంవత్సరాలు, SBI YONO, నెట్ బ్యాంకింగ్ లేదా SBI బ్రాంచ్ దరఖాస్తు చేసుకోవచ్చు.
పాలసీదారుడు మరణించినప్పుడు నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకు సాధారణంగా డెత్ సర్టిఫికెట్, KYC, PAN, ఆధార్ వంటి పత్రాలు అవసరం. పాలసీ తీసుకునే ముందు షరతులు తెలుసుకోండి.