Gold Mines: దేశంలో మొదటి ప్రైవేట్ బంగారు గని.. ఏపీలోనే నిర్మాణం

భారతదేశంలోని ప్రజలకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బంగారాన్ని పెట్టుబడి ఎంపికగా చూస్తే భారతదేశంలో మాత్రం ఆభరణాల కింద చూస్తారు. అందువల్ల దేశంలో బంగారం వినియోగం భారీగా ఉంటుంది. అయితే దేశంలో వాడే అధిక బంగారం దిగుమతులపైనే ఆధారపడుతాం. కానీ దిగుమతులను తగ్గించేలా మన దేశంలో ఉన్న బంగారపు గనుల నుంచి వచ్చే ఏడాది 400 కిలోలు ఉత్పత్తి చేయనున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Gold Mines: దేశంలో మొదటి ప్రైవేట్ బంగారు గని.. ఏపీలోనే నిర్మాణం
Gold Mines

Updated on: Jun 06, 2025 | 4:45 PM

జియోమైసోర్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతున్న ప్రాజెక్ట్ కోసం జొన్నగిరి గోల్డ్ మైన్స్‌ను నిర్వహించడానికి డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి అనుమతి పొందింది. ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ మొదలి తెలిపిన వివరాల ప్రకారం ఈ గనులు 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తాయి. గత 80 ఏళ్లలో భారతదేశంలో స్థాపించిన మొదటి ప్రైవేట్ గని ఇదేనని ఆయన అన్నారు. అయితే ఈ గని ద్వారా మొదటి సంవత్సరంలో 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని క్రమేపి చివరి దశలో గని సంవత్సరానికి 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నుంచి తుది అనుమతి పొందడం వల్ల కంపెనీ గనులు, ప్రాసెసింగ్ ప్లాంట్‌ను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. 

అయితే ఈ గనిలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు కొన్ని ట్రయల్ రన్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉన్నందున కార్యకలాపాలు ప్రారంభించడానికి మరో రెండు నెలలు పడుతుందని వివరించారు. ప్రాజెక్టు నుండి తవ్విన బంగారాన్ని ప్రాజెక్టుకు దగ్గరగా ఉన్న శుద్ధి కర్మాగారాలకు విక్రయించాలని భావిస్తున్నారు. ఈ గని నుంచి వచ్చే ఆదాయ లాభాల గురించి చర్చిస్తూ మొదటి సంవత్సరంలో 60 శాతం ఈబీఐటీడీఏ మార్జిన్ వద్ద 400 కిలోల బంగారాన్ని వెలికితీస్తే రూ. 300-350 కోట్ల ఆదాయం వస్తుందని ఆశిస్తున్నట్లు వివరించారు. దాదాపు 2027 ఆర్థిక సంవత్సరంలో జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

ఈ ప్రకటన తర్వాత డెక్కన్ గోల్డ్ షేరు ధర 10 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. అదనంగా షేర్లు కూడా అధిక పరిమాణంలో ట్రేడవుతున్నాయి. డెక్కన్ గోల్డ్ మైన్స్ షేర్లు 14.28 శాతం పెరిగి రూ.170.50కి చేరుకున్నాయి. ఇది ఆగస్టు 6, 2024 తర్వాత అత్యధిక స్థాయిగా ఉంది. గత 12 నెలల్లో ఇది 58.42 శాతం, గత సంవత్సరం నుంచి నేటి వరకు 46.70 శాతం వరకు పెరిగింది. ప్రస్తుతం ట్రేడింగ్ పరిమాణం దాని 30 రోజుల సగటు కంటే 13 రెట్లు పెరిగింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి