
సురక్షిత పెట్టుబడి పథకాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకటి. దీనిలో స్థిరమైన రాబడి, అధిక వడ్డీతో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉండటంతో అందరూ దీనిపై ఆసక్తి చూపుతారు. అయితే బ్యాంకులను బట్టి దీనిపై వచ్చే వడ్డీరేటు మారుతుంటుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ రేటును అందిస్తాయి. ఇదే క్రమంలో డీసీబీ బ్యాంకు ఇటీవల తన బ్యాంకులోని ఫిక్స్ డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) ఖాతాలపై వడ్డీ రేట్లను సవరించింది. 2023, సెప్టెంబర్ 27 నుంచి కొత్త వడ్డీరేట్లు అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రేట్లను పరిశీలిస్తే వృద్ధులకు అధిక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. సీనియర్ సెటిజెన్స్ కు డీసీబీ బ్యాంకులో చేసే ఎఫ్ డీలపై 8.50శాతం, ఇతరులకు 7.9శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఈ నేపథ్యంలో డీసీబీ బ్యాంకులో అందుబాటులో ఉన్న ఎఫ్ డీ స్కీమ్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
డీసీబీ బ్యాంకులో మీరు ప్రారంభ ఎఫ్ డీలపై కనిష్ట, గరిష్ట వడ్డీ రేట్లు, టెన్యూర్ లను ఇప్పుడు చూద్దాం.. ఏడు నుంచి 45 రోజుల ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం, ఇతరులకు 3.75 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. అలాగే 25-26 నెలలు, 37-38 నెలల కాలవ్యవధిలో సీనియర్‌లకు అత్యధికంగా 8.50 శాతం, వార్షిక రాబడి వరుసగా 9.16శాతం, 9.57 శాతంగా ఉంటుంది. ఇతరులకు, అదే పదవీకాలానికి వడ్డీ రేటు 7.90 శాతంగా బ్యాంకు నిర్ణయించింది.
సీనియర్ సిటిజెన్స్ కు అయితే 38 నెలల నుంచి 61 నెలల కంటే తక్కువ వ్యవధిలో 7.90 శాతం, 61 నెలలకు 8.15 శాతం, 61 నెలల నుంచి 120 నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే 7.75 శాతం వడ్డీ రేటును అందుకుంటారు. ఈ వడ్డీ రేట్లన్నీ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డిలకు మాత్రమే వర్తిస్తాయి.
బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ముందస్తు ఉపసంహరణలపై పెనాల్టీ పడుతుంది. ఇది ఎఫ్డీ వ్యవధి ఆధారంగా మారుతుంది. ఎఫ్డీని సృష్టించిన 14 రోజులలోపు ఉపసంహరణలకు వడ్డీకి అర్హత ఉండదు. ఆ తర్వాత ఏదైనా ముందస్తు ఉపసంహరణ కోసం, బ్యాంక్ వడ్డీ రేటుపై 0.50 శాతం పెనాల్టీని వసూలు చేస్తుంది. వర్తించే వడ్డీ రేటు కంటే 50 బేసిస్ పాయింట్లను (0.50 శాతం) తక్కువగా అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..