
Stock Market Crash : దేశీయ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్.. విదేశీ సంస్థాగత మదుపరుల లాభాల స్వీకరణ వంటి అంశాలు ముంబై మార్కెట్లకు శాపంగా మారాయి. నష్టపోయినవాటిలో బ్యాంక్, ఆటో, మెటల్, ఫార్మా స్టాక్స్‌లో అమ్మకాలు పోటెత్తడంతో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకు పైగా పతనమైంది.
బుధవారం ఉదయం నుంచి ఒత్తిడికి లోనైన మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మొదట 48వేలకు దిగువకు పడిన మార్కెట్లు.. రోజంతా పడుతూనే ఉన్నాయి. ఒకసమయంలో వెయ్యి పాయిట్లు పడిపోయిన సెన్సెక్స్ చివరికి 937.66 పాయిట్ల నష్టంతో 47409.93తో ముగిసింది.
నిఫ్టీ 271.40 పాయిట్ల కోల్పోయి 13967.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, గెయిల్, టైటాన్ కంపెనీ తదితర షేర్లు అత్యధిక నష్టాలను ఎదుర్కోగా.. టెక్ మహింద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, విప్రో, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ముందంజలో ఉన్నాయి.