Business Ideas: సొంతూర్లోనే బిజినెస్ చేయాలంటే.. దీన్ని మించిది లేదు! లక్షల్లో లాభాలు.. వ్యాపార సామ్రాజ్యం నిర్మించవచ్చు!
మీరున్న చోటే లాభదాయకమైన వ్యాపారం చేయాలనుకుంటున్నారా? డైరీ ఫామ్ ఒక గొప్ప అవకాశం. పాలు, పాల ఉత్పత్తులకు స్థిరమైన డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి అధిక లాభాలు పొందవచ్చు. ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, అవసరమైన ఖర్చులు, నిర్వహణ, చివరకు ఎంత ఆదాయం ఆశించవచ్చో తెలుసుకుని మీ సొంత డైరీ ఫామ్‌ను స్థాపించండి.

ఉన్న ఊర్లోనే హాయిగా గౌరవంగా బ్రతికే ఒక సూపర్ బిజినెస్ ఉంటే ఎంత బాగుంటుంది. అయితే ఆ బిజినెస్ డైరీ ఫామ్. చదువుకుని గేదెలు కాసుకోవాలా అని కొంతమంది అనొచ్చు.. కానీ, ఈ బిజినెస్‌లో లాభాల గురించి తెలిస్తే మాత్రం ఈ మాట అనరు. సింగల్ టైం ఇన్వెస్ట్మెంట్. చాలా కాలం వరకు ఇన్కమ్ గ్యారంటీ. ఒక్కసారి లాభాల బాట పట్టాక మీకు ఆదాయం పెరగటమే కానీ తగ్గటం అంటూ ఉండదు. అంత మంచి బిజినెస్ ఇది. పాలకి, పాల ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి డైరీ ఫామ్ బిజినెస్ పెట్టాలంటే ఏం కావాలో? ఎలా మొదలుపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
డైరీ ఫార్మ్ పెట్టాలంటే కావాల్సింది స్థలం. మీరు ఒక 10 గేదెలతో డైరీ పెట్టాలనుకుంటే అందుకోసం ముందుగా ఒక ఎక్కువ ఎత్తులో ఒక షెడ్ నిర్మించుకోవాలి. స్థలం సొంతమైతే బెటర్. లీజుకు తీసుకుని డైరీ పెడితే ఖర్చు పెరుగుతుంది. అయితే షెడ్ పైన మాత్రం ఎక్కువ పెట్టుబడి పెట్టవద్దు. షెడ్ సింపుల్ గా వేసిన సరిపోతుంది. ఇక నీటికోసం, దాణా వెయ్యటానికి తగిన ఏర్పాట్లు చేస్తే మంచిది. షెడ్ రెడీ చేసుకున్న తరువాత మనకు పశువులను కొనవలిసి ఉంటుంది. అవి కూడా ఈనెందుకు సిద్ధంగా ఉన్న బర్రెలను తీసుకుంటే మంచిది. గేదెల ధర ఒక్కోటి రూ.70 వేల వరకు ఉంటుంది. అయితే ఎక్కువ పాలిచ్చే మెహసానా, ముర్రా, హర్యానా జాతుల గేదేలయితే ఒక లక్షా ముప్పయ్ వేల వరకు ఖర్చు పెట్టాల్సి రావొచ్చు.
ఇతర ఖర్చులు..
డైరీ ఫామ్‌లో మరో ముఖ్యమైన ఖర్చు దాణా. పశుగ్రాసం బయట నుండి కొని తెచ్చుకోవచ్చు అదే మీకు ఒక రెండు ఎకరాల భూమి ఉన్నట్టయితే పశుగ్రాసం పై పెట్టే ఖర్చు తగ్గుతుంది. పచ్చిగడ్డి, ఎండు గడ్డి పెట్టొచ్చు. వీటితో పాటు వాటికీ రోజు వాటికీ ప్రత్యేకంగా తయారు చేసిన కాంసన్ట్రేట్ ఫీడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫీడ్ కోసం మొక్క జొన్న పొడి, గోధుమ బ్రాన్, నూనె గింజల పిండి (కాటన్‌సీడ్ కేక్, గ్రౌండ్నట్ కేక్) వంటి పదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. ఇవేకాకుండా వీటికి తోడు వేరుశనగ గింజలు, శనగ పొడి వంటివి వాడితే పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ మేతకు అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుంది.
మ్యాన్ పవర్..
10 గేదెల ఫార్మ్ కోసం ఒక ఇద్దరు వర్కర్లు (మీరు కూడా పని చేసేలా అయితే) అవసరం ఉంటుంది. ఇక మీ ఫార్మ్ రేంజ్ ను బట్టి ఫీడ్ కట్టర్, ప్యాకింగ్ మెషిన్ వంటి వాటికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఫీడ్ కట్టర్ 10 వేల నుండి మొదలవుతుంది. మొత్తం ఖర్చులు చూసుకుంటే షెడ్ కోసం ఒక 1 లక్షా 50 వేలు, గేదెలు కొనడానికి 10 గేదెలకు దాదాపు 12 లక్షలు, ఇక ఫీడ్ కటింగ్ మెషిన్ కోసం ఒక 20 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉండొచ్చు. ఈ ఫీడ్ కటింగ్ మెషిన్లలో చాలా ఎక్కువ ధరవి కూడా అందుబాటులో ఉన్నాయి, కానీ స్టార్టింగ్ లో బేసిక్ మెషిన్ సరిపోతుంది. ఇక ఫీడ్ కోసం, వర్కర్ల జీతాల కోసం మీకు నెలకు ఒక 35 వేల రూపాయల ఖర్చు రావొచ్చు. సో మీరు ఒక 10 గేదెలతో డైరీ ప్రారంబించాలనుకుంటే మీకు 15 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఒకసారి పెట్టుబడి పెడితే మీకు 6 నెలల్లో మీరు పెట్టిన పెట్టుబడి తిగిరి వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




