Credit Card: భారీగా పెరిగిన క్రెడిట్ కార్డు వాడకం.. ఒక్కో కార్డుపై నెలకు ఎంత ఖర్చు చేస్తున్నారంటే..?

|

Nov 24, 2023 | 9:14 AM

ఇక ఈ కామర్స్‌ సైట్స్‌ విస్తృతి పెరిగిన తర్వాత క్రెడిట్‌ కార్డుల వినియోగం ఎక్కువైంది. ఆన్‌లైన్‌ సైట్స్‌ క్రెడిట్‌ కార్డులపై భారీ డిస్కైంట్స్‌ అందిస్తుండడం, క్రెడిట్‌ కార్డుతో ఈఎమ్‌ఐ అవకాశం కల్పిస్తుండడంతో ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. డెబిట్ కార్డులతో పోల్చితే క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడమే దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తాజాగా క్రెడిట్ కార్డుల వినియోగం మరింత...

Credit Card: భారీగా పెరిగిన క్రెడిట్ కార్డు వాడకం.. ఒక్కో కార్డుపై నెలకు ఎంత ఖర్చు చేస్తున్నారంటే..?
Credit Card
Follow us on

క్రెడిట్‌ కార్డుల వినియోగం రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో చాలా సులువుగా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నారు. ఉద్యోగులకు కాకుండా వ్యాపారం చేసే వారికి కూడా బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు బిల్స్‌ చెల్లించే వారికి అనూహ్యంగా లిమిట్‌ను పెంచుతూ పోతున్నాయి.

ఇక ఈ కామర్స్‌ సైట్స్‌ విస్తృతి పెరిగిన తర్వాత క్రెడిట్‌ కార్డుల వినియోగం ఎక్కువైంది. ఆన్‌లైన్‌ సైట్స్‌ క్రెడిట్‌ కార్డులపై భారీ డిస్కైంట్స్‌ అందిస్తుండడం, క్రెడిట్‌ కార్డుతో ఈఎమ్‌ఐ అవకాశం కల్పిస్తుండడంతో ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. డెబిట్ కార్డులతో పోల్చితే క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడమే దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తాజాగా క్రెడిట్ కార్డుల వినియోగం మరింత పెరిగిందని ఓ రిపోర్ట్‌లో తేలింది.

అక్టోబర్‌ నెలలో క్రెడిట్ కార్డ్ ఖర్చులు ఏకంగా 38.3 శాతం పెరిగి ఆల్‌ టైమ్‌ హై కి చేరాయి. ఒక్క నెలలోనే ఏకంగా 1.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ నెలలో వరుసగా పండుగలు ఉండడం, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ఈ కామర్స్‌ సైట్స్‌ భారీ డిస్కౌంట్స్‌ అందించడం వల్ల క్రెడిట్ కార్డు లావాదేవీలు పెరిగాయి. గత తొమ్మిది నెలలతో పోల్చితే అక్టోబర్‌ నెలలోనే అత్యధికంగా క్రెడిట్ కార్డులను ఉపయోగించారు. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఇది 38.3 శాతం అధికం కావడం విశేషం.

ఇక గడిచిన రెండేళ్లలో నెలల వారీగా గమనిస్తే..అక్టోబర్‌లో 25.4 శాతం క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరిగినట్లు రిపోర్ట్‌లో తేలింది. ఒక్క కార్డుపై సగటున 16 శాతం ఖర్చులు పెరిగినట్లు తేలింది. ఈ లెక్కన అక్టోబర్‌ నెలలో ఒక్క క్రెడిట్ కార్డుపై సగటున రూ.18,989 ఖర్చు చేశారంటా. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు క్రెడిట్ కార్డుల వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో. ఇక ఆన్‌లైన్‌ ద్వారా చేసిన పేమెంట్స్‌లో క్రెడిట్‌ కార్డుల వినియోగం 65 శాతంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగం 20.3 శాతం పెరితాయి. ఈ లావాదేవీల విలువ అక్షరాల రూ. 45, 296 కోట్లుగా నమోదైంది.

అనంతరం ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ఖర్చు 52 శాతం పెరిగి రూ. 35, 459 కోట్లుగా నమోదైంది. ఇదిలా ఉంటే రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ పేమెంట్స్‌తో లింక్‌ చేసుకొనే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డుల వినియోగం మరిం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..