Coronavirus effect: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. వర్తక వాణిజ్యలు పూర్తిగా నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థపై భారీగా ప్రభావం పడింది. దేశ, విదేశీ రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆదాయం తగ్గిపోయిన విమానయాన సంస్థలు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి.. దాదాపు 50 శాతం వరకు నిలిపివేసింది.
ఈ నేపధ్యంలో పైలట్లు, క్యాబిన్ సిబ్బంది సహా ఉద్యోగుల ఏప్రిల్ జీతం నుండి 10-50 శాతం వరకు నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా… సంసస్థ ఛైర్మన్, సీఎండీ అజయ్ సింగ్ కూడా తన ఏప్రిల్ వేతనాన్ని వదులుకోనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా… డ్రైవర్ల తదితర జూనియర్ ఉద్యోగులకు ఏప్రిల్‌లో పూర్తి జీతం అందజేస్తున్నట్లు తెలిపింది. అయితే, తక్కువ వేతనాలున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని, ఆ వర్గాలకు పూర్తి వేతన చెల్లింపులుంటాయని సంస్థ స్పష్టం చేసింది.
The airline is ensuring that most of its employees, including those in the lowest pay grades, are not affected#SpiceJet #salaries https://t.co/SfsdYlun02
— CNBC-TV18 (@CNBCTV18News) May 2, 2021
కాగా ‘వేతనాల్లో కోత’ అన్నది తాత్కాలిక చర్య మాత్రమేనని, పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన తర్వాత… కంపెనీ నిలిపివేసిన జీతం మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నామని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వెల్లడించింది.
Read Also… Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!