Bank Loans: రిస్క్ తగ్గించుకునేందుకు బ్యాంకుల ఎత్తుగడ.. రుణం కావాలంటే హామీ ఉండాల్సిందే..!
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, అవసరాల నేపథ్యంలో లోన్ తీసుకోవడం అనేది సర్వసాధారణ విషయంగా మారింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వివిధ రకాల లోన్లను వినియోగదారులకు అందిస్తూ ఉంటాయి. కొన్ని రకాల లోన్లు ఎలాంటి హామీ లేకుండా ఇవ్వడంతో బ్యాంకులు నష్టపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ తరహా రిస్క్ తగ్గించుకునేందుకు బ్యాంకులు హామీ లేకుండా ఇచ్చే రుణాలను తగ్గిస్తున్నాయి.

భారతీయ బ్యాంకులు అన్ సెక్యూర్డ్ క్రెడిట్‌కు గురికావడాన్ని తగ్గించుకుంటున్నందున షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి ఆర్థిక ఆస్తులపై సెక్యూర్డ్ రుణాలను అందించేందుకు మొగ్గు చూపుతున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల వెల్లడైన బ్యాంకింగ్ రంగ డేటా ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీలపై రుణాలు 18 శాతం పెరిగాయి. బంగారు రుణాలు 103 శాతం పెరుగుదలతో రెట్టింపయ్యాయని పేర్కొన్నారు. ఈ పెరుగుదల పర్సనల్ లోన్స్ విషయంలో చాలా తక్కువగా ఉంది. పర్సనల్ లోన్స్ గతేడాది 20.7 శాతం నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతానికి తగ్గింది. ఈ సెక్యూర్డ్ రుణాలు తరచుగా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలుగా పేర్కొంటూ ఉంటారు. అయితే ఈ రుణాలపై కూడా కొంత రిస్క్ ఉంటుంది.
తాకట్టు పెట్టిన సెక్యూరిటీల విలువ మార్కెట్ అస్థిరతతో హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అయితే తాకట్టు పెట్టిన ఆస్తి విలువ తగ్గితే రుణగ్రహీతలు అదనపు ఆస్తులను తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లు కుదరకపోతే జరిమానా వడ్డీ రేట్లను ఎదుర్కోవాలి. అయితే ఈ వడ్డీ ప్రామాణిక రేట్ల కంటే 3 శాతం పాయింట్లు ఎక్కువగా ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ లోన్-టు-వాల్యూను నియంత్రిస్తుంది (ఎల్టివి) అటువంటి రుణాలకు నిష్పత్తిగా పేర్కొంటారు. డీమ్యాట్ రూపంలో ఉన్న ఈక్విటీలు, ఈక్విటీ-ఆధారిత మ్యూచువల్ ఫండ్లకు పరిమితి 75 శాతంగా ఉంటుంది. భౌతిక రూపంలో ఉన్న షేర్లకు ఇది 50 శాతానికి తగ్గుతుంది. సావరిన్ గోల్డ్ బాండ్లపై రుణాలు సాంప్రదాయ బంగారు రుణాల మాదిరిగానే 75 శాతం పరిమితిని అనుసరిస్తారు.
వ్యక్తిగత రుణాల మాదిరిగా కాకుండా, తాకట్టు పెట్టిన సెక్యూరిటీలు రుణ వ్యవధిలో డివిడెండ్లు, వడ్డీని సంపాదిస్తూనే ఉంటాయి. అందువల్ల బ్యాంకు సొమ్ముకు గ్యారెంటీ ఉంటుంది. బ్యాంకులకు తక్కువ క్రెడిట్ రిస్క్, అలాగే డిఫాల్ట్ విషయంలో వారు కొలేటరల్‌ను లిక్విడేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్ధిక ఒత్తిడిని నివారించడానికి వినియోగదారులు తమ ద్రవ్య అవసరాలను అంచనా వేయాలని అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








