Coal Shortage: దేశంలో బొగ్గు కొరత లేదన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఉత్పత్తి పెరుగుతున్నట్లు వెల్లడి..

|

Apr 23, 2022 | 8:13 PM

దేశంలో బొగ్గు(Coal) కొరతపై ఉన్న భయాందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దేశంలో బొగ్గు కొరత లేదని, నెలకు సరిపడా బొగ్గు ఉందని పేర్కొంది...

Coal Shortage: దేశంలో బొగ్గు కొరత లేదన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఉత్పత్తి పెరుగుతున్నట్లు వెల్లడి..
Coal Mine
Follow us on

దేశంలో బొగ్గు(Coal) కొరతపై ఉన్న భయాందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దేశంలో బొగ్గు కొరత లేదని, నెలకు సరిపడా బొగ్గు ఉందని పేర్కొంది. విద్యుత్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరాను నిరంతరం పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి(Joshi) తెలిపారు. దేశంలోని సగానికి పైగా పవర్ ప్లాంట్‌(Power Plant)లలో అవసరమైన దానికంటే చాలా తక్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇది దేశంలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితి లేదని మంత్రి ఈరోజు చెప్పారు. కోల్ ఇండియా సహా వివిధ ప్రాంతాల్లో 725 మిలియన్ టన్నుల బొగ్గు ఉందని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ ద్వారా తెలిపారు. అదే సమయంలో థర్మల్ పవర్ ప్లాంట్‌లో 22 మిలియన్ టన్నుల బొగ్గు ఉందని గుర్తు చేశారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి నిరంతరం పెరుగుతోందని అన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 8 శాతానికి పైగా పెరిగి 77 మిలియన్ టన్నులు దాటింది. కోల్ ఇండియా ఉత్పత్తి 4 శాతానికి పైగా పెరిగి 62 మిలియన్ టన్నులకు చేరింది. ఈ సంవత్సరం వేసవిలో ఉష్ణోగ్రత పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. పవర్ ప్లాంట్‌లో బొగ్గు కొరత ఏర్పడింది. అయితే రైల్వే మంత్రిత్వ శాఖ బోగీల సంఖ్యను 20 శాతం పెంచడంతో బొగ్గు సరఫరా మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ 2022 మొదటి 15 రోజులలో గృహ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. పవర్ ప్లాంట్‌లో బొగ్గు కొరత కారణంగా దేశంలోని 12 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ హెచ్చరించింది.

మరిన్ని బిసినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Read Also.. Bank of baroda: గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించిన ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎంతంటే..