Car Buying Tips: కారు కొంటున్నారా? తెలియక ఈ పొరపాటు చేస్తే జేబుకు చిల్లే!

సొంత కారు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. అయితే షోరూమ్‌కి వెళ్ళినప్పుడు ఎదురయ్యే అతి పెద్ద ప్రశ్న ఆటోమేటిక్ కారు తీసుకోవాలా లేక మాన్యువల్ కారు తీసుకోవాలా? ఒకప్పుడు ఆటోమేటిక్ కార్లు అంటే కేవలం లగ్జరీ విభాగంలోనే ఉండవు అనుకునేవారు. కానీ, మారుతున్న టెక్నాలజీతో ఇప్పుడు బడ్జెట్ కార్లలోనూ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అందుబాటులోకి వచ్చింది. డ్రైవింగ్ సౌలభ్యం నుండి మైలేజీ వరకు ఈ రెండింటి మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Car Buying Tips: కారు కొంటున్నారా? తెలియక ఈ పొరపాటు చేస్తే జేబుకు చిల్లే!
Choosing Between Automatic And Manual Cars

Updated on: Jan 22, 2026 | 4:38 PM

డ్రైవింగ్ అనుభవం అనేది వ్యక్తిగత ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. కొందరికి గేర్లు మారుస్తూ కారును పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకోవడం ఇష్టమైతే, మరికొందరు ఎడమ కాలు చేతికి పని లేకుండా హాయిగా ప్రయాణించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్‌ల దృష్ట్యా ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు, తక్కువ ఖర్చు ఎక్కువ నియంత్రణ కోరుకునే వారికి మాన్యువల్ కార్లే మొదటి ఛాయిస్. మరి ఈ రెండింటిలో ఏది మీ అవసరాలకు సరిపోతుందో ఇప్పుడు చూద్దాం.

ఆటోమేటిక్ కార్ల ప్రత్యేకత – నగరాల్లో సౌకర్యం:

ఆటోమేటిక్ కార్ల ప్రధాన ప్లస్ పాయింట్ ‘కంఫర్ట్’. నగరాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు క్లచ్ నొక్కడం, గేర్లు మార్చడం డ్రైవర్లను బాగా అలసట పరుస్తుంది. ఆటోమేటిక్ కార్లలో ఈ ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా, గతంలో ఆటోమేటిక్ కార్లు తక్కువ మైలేజీ ఇస్తాయని పేరు ఉండేది, కానీ నేటి ఆధునిక AMT మరియు CVT టెక్నాలజీలు మాన్యువల్ కార్లతో సమానమైన మైలేజీని అందిస్తున్నాయి. కేవలం సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రాధాన్యత ఇచ్చే వారికి ఆటోమేటిక్ కార్లు సరైన ఎంపిక.

మాన్యువల్ కార్ల పవర్ – తక్కువ ఖర్చు నియంత్రణ:

మాన్యువల్ కార్లు ఇప్పటికీ డ్రైవింగ్ ప్రియుల ఫేవరెట్. హైవేలపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా ఓవర్‌టేక్ చేసే సమయంలో గేర్లను మనకు నచ్చిన విధంగా నియంత్రించే సదుపాయం మాన్యువల్ కార్లలో ఉంటుంది. దీనివల్ల డ్రైవింగ్‌లో ఒక రకమైన ‘థ్రిల్’ లభిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే, ఆటోమేటిక్ కార్లతో పోలిస్తే మాన్యువల్ కార్ల ధర తక్కువ. అలాగే వీటిని మెయింటైన్ చేయడం లేదా రిపేర్ చేయడం కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వాహనంపై పూర్తి కంట్రోల్ ఉండాలని కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్.

మొత్తంమీద, మీరు ఎక్కువగా సిటీ ట్రాఫిక్‌లో తిరుగుతుంటే డ్రైవింగ్ సులభంగా ఉండాలనుకుంటే ఆటోమేటిక్ కారు మంచిది. అలా కాకుండా, మీ ప్రయాణాలు ఎక్కువగా హైవేలపై ఉండి, బడ్జెట్ తక్కువలో కావాలనుకుంటే మాన్యువల్ కారును ఎంచుకోవచ్చు. మీ అవసరాలు, డ్రైవింగ్ స్టైల్ బడ్జెట్‌ను బట్టి ఈ రెండింటిలో దేనికైనా ఓటు వేయవచ్చు.