EV Battery: పదిన్నర నిమిషాల్లోనే 80శాతం చార్జింగ్.. టెస్లాను బీట్ చేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ..

|

Aug 14, 2024 | 12:49 PM

Fastest Charging EV Battery: తాము తీసుకొచ్చిన ఈ బ్యాటరీలు 10శాతం నుంచి 80శాతం చార్జింగ్ కావడానికి కేవలం పదిన్నర నిమిషాలే తీసుకుంటుందని వెల్లడించింది. ఇదే సమయంలో ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లాకు చెందిన లేటెస్ట్ ఇన్వెన్షన్ మోడల్-3లో వినియోగంచే బ్యాటరీ ఇదే చార్జింగ్ చేయడానికి 15 నిమిషాలు పడుతుందని వివరించింది. ఈ బ్యాటరీ రేంజ్ 282 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది.

EV Battery: పదిన్నర నిమిషాల్లోనే 80శాతం చార్జింగ్.. టెస్లాను బీట్ చేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ..
Zeekr's 2025 007 Sedan
Follow us on

విద్యుత్ శ్రేణి వాహనాల వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చార్జింగ్ సమయం. ఇదే చాలా మందిని వాటివైపు చూడకుండా చేస్తోంది. సాధారణ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కార్లు ఎక్కడైనా నిమిషాల్లో రీఫ్యూలింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం కొన్ని గంటల సమయం రీచార్జ్ కోసం తీసుకుంటాయి. దీనివల్ల వాటిని ఎక్కువ దూరాలకు వినియోగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపైనే ఫోకస్ పెట్టిన ప్రధాన ఎలక్ట్రిక్ వాహన తయారీ దారులు పలు వినూత్న ఆవిష్కరణలను పరిచయం చేస్తున్నాయి. వీటిల్లో ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లాతో పాటు చైనాకు చెందిన బీవైడీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా తలదన్నే రీతిలో ఓ కొత్త బ్యాటరీని ఆవిష్కరించింది చైనాకు చెందిన జీక్ర్ సంస్థ. తాము తీసుకొచ్చిన ఈ బ్యాటరీలు 10శాతం నుంచి 80శాతం చార్జింగ్ కావడానికి కేవలం పదిన్నర నిమిషాలే తీసుకుంటుందని వెల్లడించింది. ఇదే సమయంలో ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లాకు చెందిన లేటెస్ట్ ఇన్వెన్షన్ మోడల్-3లో వినియోగంచే బ్యాటరీ ఇదే చార్జింగ్ చేయడానికి 15 నిమిషాలు పడుతుందని వివరించింది. ఈ బ్యాటరీ రేంజ్ 282 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఈ బ్యాటరీలు మంచి పనితీరును అందిస్తాయని వివరించింది. దీనిని బట్టి తమ బ్యాటరీని ఎలాన్ మస్క్ టెస్లా కన్నా మెరుగైనదిగా కంపెనీ క్లయిమ్ చేసుకుందది.

వచ్చే వారం కొత్త కారు..

చైనాకు చెందిన జీక్ర్ నుంచి కొత్త సెడాన్ వచ్చే వారం లాంచ్ కానుంది. 2025 జీక్ర్ 007 పేరుతో అందుబాటులోకి రానుంది. ఈ సెడాన్ లోనే జీక్ర్ రూపొందించిన అడ్వాన్స్ డ్ బ్యాటరీని అమర్చినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా సినో ఆటో ఇన్ సైట్స్ డైరెక్టర్ టూ లీ మాట్లాడుతూ విద్యుత్ శ్రేణి వాహనాల మార్కెట్లో ఇక టెస్లా చార్జింగ్ టెక్నాలజీ బీట్ చేస్తూ కొత్త సాంకేతికతను జీక్ర్ రూపొందించిందన్నారు. జీక్ర్ క్లయిమ్ చేస్తున్న విషయాలు అద్భుతమనే చెప్పాలి. ఇది తప్పనిసరిగా ప్రపంచంలోనే వేగవంతమైన చార్జింగ్ టెక్నాలజీల్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.

జీక్ర్ సంస్థ ప్రస్థానం..

చైనా కార్ల తయారీలో దిగ్గజంగా పేరున్న గీలీకి చెందిన సంస్థే ఈ జీక్ర్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ హోల్డింగ్ లిమిటెడ్, యూకేకు చెందిన లోటస్, స్వీడన్ కుచెందిన వోల్వో కూడా ఈ గ్రూపులోని సంస్థలే. దీనిని బట్టి జీక్ర్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ జీక్ర్ సంస్థకు చైనాలోనే 500 అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ సంఖ్యను ఏడాది చివరి నాటికి రెట్టింపు చేసే లక్ష్యంతో జీక్ర్ పనిచేస్తోంది. 2026 నాటికి చైనా మొత్తంలో 10,000 చార్జింగ్ స్టేషన్లు అందుబబాటులో ఉంచుకునేలా కార్యాచరణను రూపొందించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..