Multibagger Stocks: 10 ఏళ్లలో 12,000 శాతం రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ.. రానున్న కాలంలో షేర్ విలువ ఎంత పెరగనుందంటే..

|

May 21, 2022 | 3:02 PM

Multibagger Stocks: సాధారణంగా అందరూ మల్టీబ్యాగర్ షేర్ల కోసం కంపెనీలను జల్లెడ పడుతుంటారు. ఈ క్రమంలో మంచి ఆర్థిక స్థిరత్వం కలిగి ఉండే షేర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంటాయి.

Multibagger Stocks: 10 ఏళ్లలో 12,000 శాతం రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ.. రానున్న కాలంలో షేర్ విలువ ఎంత పెరగనుందంటే..
Stock market
Follow us on

Multibagger Stocks: సాధారణంగా అందరూ మల్టీబ్యాగర్ షేర్ల కోసం కంపెనీలను జల్లెడ పడుతుంటారు. ఈ క్రమంలో మంచి ఆర్థిక స్థిరత్వం కలిగి ఉండే షేర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంటాయి. కరోనా తరువాత అనేక కంపెనీలు అనూహ్యంగా వెలుగులోకి వచ్చాయి. అవి మంచి పనితీరును కనబరుస్తున్నాయి. కెమికల్స్ వ్యాపారంలో ఉన్న ఈ కంపెనీ కూడా తన ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందించింది.

స్పెషల్ కెమికల్స్ వ్యాపారంలో ఉన్న దీపక్ సైట్రైట్ సంస్థ షేర్లు కేవలం పది సంవత్సరాల కాలంలో 12,000 శాతం రాబడిని అందించాయి. మే16,2012 నుంచి మే 2022 కాలానికి గాను కంపెనీ ఈ రాబడిని అందించింది. మే నెలలో కంపెనీ షేర్ విలువ రూ.1,982కి చేరుకుంది. గడచిన మూడు సంవత్సరాల కాలంలో షేర్ విలువ రూ.290 నుంచి రూ.1,982కి చేరింది. ఈ కాలంలో ఏకంగా 500 శాతం పెరుగుదలతో ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించింది.

2022 నాల్గవ త్రైమాసికంలో కంపెనీ రూ.267 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలానికి లాభం రూ.290 కోట్లుగా ఉంది. అంటే సుమారు 7 శాతం లాభాల్లో క్షీణత నమోదైంది. మార్కెట్ల పతనం కొనసాగుతున్నప్పటికీ కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.26,169 కోట్లుగా ఉంది. నిపుణుల అంచనా ప్రకారం రానున్న కాలంలో కెమికల్ కంపెనీల వ్యాపారంలో గ్రోత్ ఉంటుందని తెలుస్తోంది. 2024 నాటికి దీపక్ నైట్రైట్ షేర్ విలువ రూ.2,881 ను తాకుతుందని వారు అంటున్నారు.

గమనిక: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి