
మార్కెట్లో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్ల హవా మొదలైంది. మంచి ఫీచర్లతో పాటు ఎక్కువ కిలోమీటర్ల రేంజ్ ఇచ్చేలా కంపెనీలు ఈవీలను రెడీ చేస్తున్నాయి. హైవేలపైన ఛార్జింగ్ స్టేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో చాలామంది పెట్రోల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ కార్ల వైపు చూస్తున్నారు. అయితే తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి టాటా టియాగో ఒక మంచి ఆప్షన్. ఈ కారు సింగిల్ ఛార్జ్ కు 250 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ కారు గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ డైజైన్ తో ఉంటుంది. ఇందులో నలుగురు కూర్చోవచ్చు. ఈ కారులో 4 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ మోడల్ లో 19.2 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 250 km రేంజ్ ఇస్తుంది. అలాగే మరో మోడల్‌లో 24 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 315 km రేంజ్ ఇస్తుంది. అయితే కస్టమర్ల రీవ్యూలను బట్టి రియల్ వరల్డ్‌లో 19.2 kWh వేరియంట్ 160 కిలోమీటర్లు, 24 kWh వేరియంట్ 200 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని తెలుస్తుంది. అయితే రేంజ్ అనేది స్పీడ్, రోడ్డు కండిషన్ ను బట్టి కూడా మారుతుంటుంది. ఓవరాల్ గా చూస్తే.. ఈ కారు ఒక కిలోమీటర్ వెళ్లేందుకు ఒక రూపాయి ఖర్చవుతుంది అనుకోవచ్చు.
ఈ కారులో మంచి ఫీచర్లో పాటు పెర్ఫామెన్స్ కూడా బాగుంటుంది. కేవలం10 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్, ఆపిల్ కనెక్టివిటీ ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, రియర్ కెమెరా, క్రూజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 240 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ , ABS వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ధరల విషయానికొస్తే.. టాటా టియాగో బేస్ వేరియట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి మొదలవుతుంది. వెయింటింగ్ పీరియడ్ రెండు నెలలు ఉంది. ఇప్పుడు బుక్ చేసుకుంటే రెండు నెలల తర్వాత కారు డెలివరీ ఇస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి