Bank Rules: ఈ నెలలో బ్యాంకుల నియమాల మార్పు.. వడ్డీల వసూల విషయంలో కీలక ఆదేశాలు
ఏప్రిల్ 1 నుంచి రుణగ్రహీతల విషయంలో సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అపరాధ రుసుము , రుణాలపై వడ్డీ నియమాలకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజా మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు రుణగ్రహీతలకు అదనపు ఛార్జీలు విధించకుండా ఆపివేస్తాయి. ముఖ్యంగా డిఫాల్ట్ రుణ చెల్లింపులు లేదా ఇతర రుణ నియమాలను ఉల్లంఘించినందుకు జరిమానా ఛార్జీలపై కొత్త అమల్లోకి వస్తాయి.

ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తికి బ్యాంకింగ్ అవసరాలు పెరిగాయి. ముఖ్యంగా ప్రతి వ్యక్తికి బ్యాంకు అకౌంట్ అనేది తప్పనిసరయ్యాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఖర్చుల వల్ల రుణాల పొందే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే ఈ ఏప్రిల్ 1 నుంచి రుణగ్రహీతల విషయంలో సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అపరాధ రుసుము , రుణాలపై వడ్డీ నియమాలకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజా మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు రుణగ్రహీతలకు అదనపు ఛార్జీలు విధించకుండా ఆపివేస్తాయి. ముఖ్యంగా డిఫాల్ట్ రుణ చెల్లింపులు లేదా ఇతర రుణ నియమాలను ఉల్లంఘించినందుకు జరిమానా ఛార్జీలపై కొత్త అమల్లోకి వస్తాయి.
జరిమానా ఛార్జీలు, వడ్డీ నియమాలు
కొత్త ఆదేశాల ప్రకారం ఆర్‌బీఐ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలను జరిమానా వడ్డీని వసూలు చేయకుండా నిలిపివేసింది. సాధారణంగా ఆలస్యమైన ఈఎంఐ చెల్లింపుల కోసం వినియోగదారులపై విధిస్తారు. తాజా ఆదేశాల నేపథ్యంలో వారు వడ్డీ రేటుకు అదనపు ఛార్జీలను జోడించడానికి వీలు ఉండదు. బ్యాంకులు జరిమానాలు విధించే అవకాశం ఉన్నా ఈ ఛార్జీలను లోన్ మొత్తానికి జోడించకూడదు లేదా వాటిపై అదనపు వడ్డీని లెక్కించకూడదు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి తరచుగా ఈ ఛార్జీలను విధిస్తాయి. అయితే రుణగ్రహీతల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
ఛార్జీలు, వడ్డీ
రుణగ్రహీతలు డిఫాల్ట్ లేదా పాటించడంలో విఫలమైనప్పుడు రుణదాతలు సాధారణంగా జరిమానాలు విధిస్తారు. ఇది స్థిర ఛార్జీలు (పెనాల్ ఛార్జీలు) లేదా అదనపు వడ్డీ (పెనాల్ వడ్డీ) రూపంలో తీసుకోవచ్చు. జరిమానా ఛార్జీలు వడ్డీ నుండి వేరుగా నిర్ణయించే రుసుము. అయితే జరిమానా వడ్డీ అనేది కస్టమర్‌కు సంబంధించిన ప్రస్తుత వడ్డీ రేటుకు జోడించం వల్ల అదనపు వడ్డీగా పరిగణిస్తారు. రుణం మొత్తంలో అపరాధ రుసుములను చేర్చవద్దని. ఈ ఛార్జీలపై అదనపు వడ్డీని లెక్కించవద్దని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది.
అమలు ఇలా
కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే అన్ని కొత్త రుణాలకు వర్తిస్తాయి. ప్రస్తుత రుణాలు జూన్ 1, 2024 నుండి ప్రారంభమయ్యే నిబంధనలకు లోబడి ఉంటాయి. ఆర్థిక సంస్థలకు సర్దుబాటు చేయడానికి మరింత సమయం ఇవ్వడానికి ఆర్‌బీఐ అమలు తేదీని జనవరి 1 నుండి ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. రిటైల్, కార్పొరేట్ రుణగ్రహీతలు ఇద్దరూ ఒకే రుణ ఉత్పత్తికి ఒకే విధమైన జరిమానాలను ఎదుర్కొంటారు.
జరిమానా ఛార్జీలు
డిఫాల్ట్ చేసిన మొత్తం ఆధారంగా బ్యాంకులు ఛార్జీలను వర్తింపజేస్తాయి. బోర్డు ఆమోదించిన పాలసీ ప్రకారం నిష్పక్షపాతంగా, స్థిరంగా ఛార్జీలు విధించాలని ఆర్‌బీఐ రుణదాతలను ఆదేశించింది. జరిమానా ఛార్జీలు సహేతుకమైనవి అయినప్పటికీ ఆర్‌బీఐ ఈ ఛార్జీలకు గరిష్ట పరిమితిని పేర్కొనలేదు.
ఇతర రుణాలు
అప్‌డేట్ చేసిన మార్గదర్శకాలు సెక్యూరిటైజేషన్, సహ-లెండింగ్ పోర్ట్‌ఫోలియోలను కవర్ చేస్తాయి. అయితే విదేశీ కరెన్సీ ఎగుమతి క్రెడిట్, ఇతర విదేశీ కరెన్సీ రుణాలను మినహాయించాయి. నాన్‌పెర్ఫార్మింగ్ లోన్ ఖాతాలకు సంబంధించి ఆర్‌బీఐ వసూలు చేయని ఆర్జిత ఆదాయాన్ని వెనక్కి తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి