2000 Notes: రూ.2000 నోట్లను త్వరగా మార్చుకోండి.. బ్యాంకుల సెలవులతో ఇబ్బందులు!

|

Aug 20, 2023 | 4:59 PM

ఈ రోజుల్లో బ్యాంకింగ్‌కు సంబంధించిన చాలా పనులు ఇంటి నుంచే జరుగుతున్నప్పటికీ, ఇంకా చాలా పనుల కోసం బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోంది. నోట్లు మార్చుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. అటువంటి పరిస్థితిలో మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆర్బీఐ ప్రకటించిన బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్ట్‌లోని మిగిలిన 13 రోజుల పాటు ఏ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయో తెలుసుకుందాం..

2000 Notes: రూ.2000 నోట్లను త్వరగా మార్చుకోండి.. బ్యాంకుల సెలవులతో ఇబ్బందులు!
Rs 2000 Notes
Follow us on

మీ వద్ద ఇప్పటికీ రూ. 2000 నోట్లు ఉండి వాటిని మార్చుకోవడానికి చివరి క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు ముఖ్యమైన వార్త. అయితే 2000 నోట్ల మార్పిడికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వచ్చే నెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అయితే సమయం దగ్గర పడుతుండటంతో ఇబ్బదులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే త్వరగా మార్పిడి చేసుకోవడం మంచిదంటున్నారు బ్యాంకు అధికారులు.

ఆగస్టులో 13 బ్యాంకులకు 7 సెలవులు:

చివరి నిమిషంలో నోట్ల మార్పిడి కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉండడం వల్ల బ్యాంకుల్లో రద్దీ, నగదు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఇలా చెబుతున్నాం. అదే సమయంలో ఆర్బీఐ కూడా ఆగస్టులో మిగిలిన 13 రోజులలో 7 రోజులు బ్యాంక్ సెలవులను ప్రకటించింది.

సెప్టెంబరులో కూడా చాలా సెలవులు:

ఇప్పుడు మీరు నోట్లను మార్చుకోవాలనుకుంటే మీరు మీ పనిని 7 రోజులలోపు పూర్తి చేయాలి లేదా మీకు ఏదైనా బ్యాంక్ సంబంధిత పని ఉంటే దానిని సకాలంలో పూర్తి చేయండి. ఎందుకంటే సెప్టెంబర్‌లో కూడా గణేష్ పూజ, జన్మాష్టమి, అనేక ఇతర కారణాల వల్ల బ్యాంకులు మూసి ఉండే అవకాశం ఉంది. మరి రానున్న రోజుల్లో బ్యాంకులు ఎప్పుడు బంద్ అవుతాయో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

నోటు మార్చుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే..

ఈ రోజుల్లో బ్యాంకింగ్‌కు సంబంధించిన చాలా పనులు ఇంటి నుంచే జరుగుతున్నప్పటికీ, ఇంకా చాలా పనుల కోసం బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోంది. నోట్లు మార్చుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. అటువంటి పరిస్థితిలో మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆర్బీఐ ప్రకటించిన బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్ట్‌లోని మిగిలిన 13 రోజుల పాటు ఏ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయో తెలుసుకుందాం.

13 రోజుల్లో ఏయే రోజుల్లో ఏయే బ్యాంకులు మూసి ఉంటాయి?

  • 20 ఆగస్టు – ఆదివారం – బ్యాంకులు ప్రతిచోటా బ్యాంకులు మూసి ఉంటాయి.
  • ఆగష్టు 26 – నాల్గవ శనివారం – ప్రతిచోటా బ్యాంకులు మూసే ఉంటాయి.
  • 27 ఆగస్టు – ఆదివారం – బ్యాంకులు ప్రతిచోటా మూసి ఉంటాయి.
  • ఆగస్టు 28 – సోమవారం – ఓనం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు.
  • ఆగష్టు 29 – మంగళవారం – తిరువనంతపురం కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంక్ సెలవు.
  • ఆగస్టు 30 – బుధవారం – రక్షాబంధన్ సెలవుల కారణంగా జైపూర్, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • ఆగస్టు 31 – గురువారం – రక్షా బంధన్ పండగ, శ్రీ నారాయణ గురు జయంతి కారణంగా కాన్పూర్, లక్నో, డెహ్రాడూన్‌లలో బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయి.

అయితే నిపుణులు చెబుతున్నదేంటి అంటే.. ఆయా రాష్ట్రాలు వివిధ పండగలు, ఇతర కార్యక్రమాల కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అలాంటి సమయంలో నోట్ల మార్పిడి కోసం చివరి సమయం వరకు వేచి ఉంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముందస్తుగా అప్రమత్తం కావడమే మంచిదంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి