Union Budget: అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి శుభవార్త..! బడ్జెట్‌లో కీలక నిర్ణయం దిశగా కేంద్రం

బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతోంది. పలు పన్ను మినహాయింపులు ఉండే అవకాశముంది. పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అవకాశముంది. ఇందులో భాగంగా గృహ రుణాల వడ్డీపై ఇస్తున్న పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అవకాశముందని తెలుస్తోంది.

Union Budget: అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి శుభవార్త..! బడ్జెట్‌లో కీలక నిర్ణయం దిశగా కేంద్రం
Union Budget 2026 27

Updated on: Jan 26, 2026 | 7:17 PM

గ్రామాలు, పట్టణాల నుంచి ఉపాధి, విద్య కోసం లక్షల మంది నగరాలకు చేరుకుంటారు. ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని కొంతమంది ఉంటే.. ఆర్ధిక స్తోమత లేనివారు అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. నగరాల్లో లక్షల మంది ఇలా ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వీరికి ప్రయోజనం చేకూర్చేలా పలు రూల్స్‌ను ఇప్పటికే ప్రవేశపెట్టింది. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో వీరికి సంబంధించి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ట్యాక్స్ మినహాయింపులతో పాటు కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారికి లబ్ది చేకూర్చేలా పలు ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది.

రూ.5 లక్షలకు పన్ను మినహాయింపు పెంపు

నేషనల్ రెంటల్ హౌసింగ్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని రియల్ ఎస్టేట్ అత్యున్నత సంస్థ అయిన క్రెడాయ్ ప్రతిపాదించింది. దీనిని వెంటనే అమలు చేయాలని బలంగా డిమాండ్ చేస్తోంది. దీని ద్వారా హోమ్ లోన్ల వడ్డీపై పన్ను మినహాయింపులు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం నగరాల్లో వలసదారుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆ సంఖ్యకు తగ్గట్లు అద్దె ఇళ్లు అందుబాటులో లేవు. దీంతో నేషనల్ రెంటల్ హౌసింగ్ మిషన్ ప్రారంభించాలని క్రెడాయ్ డిమాండ్ చేస్తోంది. దీని వల్ల అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారితో పాటు డెవలపర్లకు పన్ను మినహయింపులు ఇవ్వాలని కోరుతోంది.

డెవలపర్లకు ఆర్ధిక ప్రయోజనం

నగరాల్లో జనాభా రద్దీకి తగ్గట్లు  అద్దె ఇళ్లను ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముంది. డెవలపర్లకు ఆర్ధిక ప్రోత్సాహకాలతో పాటు అద్దె చెల్లించేవారికి పన్ను ఉపశమనం వంటివి ఇవ్వడం ద్వారా లాభం జరుగుతుంది. ఇక హోమ్ లోన్ల వడ్డీపై పన్న మినహాయింపులను రూ.5 లక్షలుగా పెంచడం వల్ల కొత్త ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతాయని క్రెడాయ్ సూచించింది. రానున్న బడ్జెట్‌లో దీని గురించి కీలక నిర్ణయాలు ఉంటాయని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. బడ్జెట్‌లో పలు పన్ను మినహాయింపులు ఉంటాయని తెలుస్తోంది. అందులో భాగంగా హోమ్ లోన్ల వడ్డీపై పన్ను మినహాయింపులపై కూడా రిలీఫ్ ఉండే అవకాశముంది.