
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. వీటి ఎగుమతులకు సంబంధించి తాజాగా బిగ్ డెసిషన్ తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న విండ్‌ఫాల్ పన్నులను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. 15 రోజులకు ఒకసారి వీటిపై కేంద్రం సమీక్ష నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా నిర్వహించిన రివ్యూలో డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును పెంచాలని నిర్ణయించింది. ఇక పెట్రోల్ ఎగుమతులపై పన్నును తగ్గించింది. జూలై 16వ తేదీ నుంచి కొత్త ట్యాక్సులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.4 నుండి రూ.2.5కు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ.7.5 ఇప్పటివరకు ఉండగా.. నేటి నుంచి రూ.15.5కు పెంచారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఇంధన ఎగుమతులపై కూడా రూ.7.5 నుంచి రూ.14.5కు పెంచారు. డీజిల్, ఏటీఎఫ్ ఇంధనంపై ఎగుమతి సుంకాన్ని దాదాపు రెట్టింపు చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య వార్ మళ్లీ స్టార్ట్ కావడంతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య విండ్‌ఫాల్ పన్నులో కేంద్రం మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌పై అమెరికా తిరిగి నావికా దిగ్బంధనాన్ని విధించింది. దీంతో హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. దీని ఫలితంగా బుధవారం బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపు 2 శాతం పెరిగి బ్యారెల్‌కు 84.73 డాలర్లకు చేరుకున్నాయి.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ట్యాంకర్లపై దాడులు కూడా ధరల పెరుగుదలకు దోహదపడ్డాయని చెప్పవచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆందోళనలు తదుపరి పెరుగుదలను పరిమితం చేశాయి. అటు రిటైల్ అవుట్‌లెట్లలో డీజిల్ అమ్మకాలు పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ ఆమోదించిన వాహన ఇంధన ట్యాంకులు లేదా కంటైనర్లకు మాత్రమే పరిమితం చేశారు. ప్రతి వినియోగదారుడు లేదా వాహనానికి రోజువారీ డీజిల్ కొనుగోలు పరిమితిని 200 లీటర్లుగా నిర్ణయించారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమలులో ఉంటాయి. ఉత్తర్వు ద్వారా ప్రభుత్వం వీటిని పొడిగించవచ్చు. పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా తలెత్తిన అధిక ఖర్చుల నుండి వినియోగదారులను రక్షించడానికి ప్రభుత్వఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ ఇంధన ధరలను అదుపులో ఉంచాయి. అయితే టోకు వినియోగదారులు మార్కెట్‌కు అనుగుణమైన ధరలను చెల్లించడంతో ధరల్లో వ్యత్యాసం ఏర్పడింది