Free Ration: పేద ప్రజలకు కేంద్రం గుడ్‌ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి ఉచితంగానే రేషన్..?

| Edited By: Anil kumar poka

Jan 02, 2023 | 5:43 PM

Free Ration: కేంద్రప్రభుత్వం 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు పేద ప్రజలకు తీపి కబురు అందిచనున్నట్లు తెలుస్తోంది. జాతీయ ఆహార భద్రత పథకం కింద పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్‌ కింద బియ్యం లేదా గోధుమలతో పాటు మరికొన్ని నిత్యవసర వస్తువులు తక్కువ ధరకు అందిస్తూ

Free Ration: పేద ప్రజలకు కేంద్రం గుడ్‌ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి ఉచితంగానే రేషన్..?
Free Ration Scheme
Follow us on

Free Ration: కేంద్రప్రభుత్వం 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు పేద ప్రజలకు తీపి కబురు అందిచనున్నట్లు తెలుస్తోంది. జాతీయ ఆహార భద్రత పథకం కింద పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్‌ కింద బియ్యం లేదా గోధుమలతో పాటు మరికొన్ని నిత్యవసర వస్తువులు తక్కువ ధరకు అందిస్తూ వస్తోంది. కోవిడ్-19 కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటంతో.. దాదాపు దేశంలో 80 కోట్ల మందికి పైగా జనాభాకు ఉచిత రేషన్ అందించడం కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా కేంద్రప్రభుత్వంపై ఆర్థికంగా అదనపు భారం పడింది. నెలవారీ ఇస్తున్న రేషన్‌కు అదనంగా.. ఓ వ్యక్తికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం లేదా గోధుమలు గత కొంతకాలంగా ఇస్తుండటంతో కోట్లాది రూపాయల అదనపు భారం కేంద్రప్రభుత్వంపై పడినట్లైంది. అయితే ఈ పథకం ఎంతో మంది పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు.. అనేక రాష్ట్రాల్లో కేంద్రంలోని అధికారపార్టీ అయిన బీజేపీకి రాజకీయంగా ప్రయెజనం చేకూరింది. దీంతో ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం పొడిగిస్తూ వస్తోంది. అయితే ఈ పథకం అమలు కేంద్రప్రభుత్వానికి ఆర్థికంగా భారం కావడంతో.. 2023-24 సాధారణ బడ్జెట్‌కు ముందు ద్రవ్య లోటును అదుపులోకి తీసుకురావడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలుగా ఉంది. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు.. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఈ పథకాన్ని మార్పు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలవుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను విలీనం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2020 ఏప్రియల్‌ నుంచి PMGKAY కింద కేంద్ర ప్రభుత్వం సుమారు 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలను ఉచితంగా అందిస్తోంది. అలాగే ఆహార భద్రతా చట్టం కార్యక్రమం కింద, దేశంలోని పేద ప్రజలకు తక్కువ ధరలకే ప్రభుత్వం ప్రతి వ్యక్తికి 5 కిలోల ఆహార ధాన్యాలను ఇస్తుంది. వీటిలో గోధుమలు కిలో రూ.2 కాగా.. బియ్యం ధర రూ.3గా ఉంది. అదే సమయంలో, దేశంలోని అంత్యోదయ పథకం కింద పేదలకు 35 కిలోల రేషన్ బియ్యాన్ని ఇస్తున్నారు.

ఆహార భద్రత కార్యక్రమంలో PMGKAYని విలీనం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను నిలిపివేయనుంది. ఇదే సమయంలో ఆహార భద్రతా కార్యక్రమం కింద ఇచ్చే ఆహార ధాన్యాలను వచ్చే ఏడాది పాటు ఉచితంగా అందించనుంది. ఈ నిర్ణయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అంటే జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో GDPలో 0.15 శాతానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం ఆదా చేస్తుందని అంచనా వేయబడింది.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ పంపిణీ గడువు ఈనెలతో ముగుస్తుంది. ఈ పథకాన్ని ఇప్పటి వరకు అనేకసార్లు పొడిగిస్తూ వచ్చారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇది దేశ జిడిపిలో 1.4 శాతానికి సమానం. అలాగే ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద ఇచ్చే సబ్సిడీకి అయ్యే ఖర్చు అదనం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 2.07 లక్షల కోట్ల ఆహార సబ్సిడీని అందించింది. అయితే ఇప్పుడు అది రూ.3 లక్షల కోట్లు దాటుతుందని అంచనా. 2023 డిసెంబరు వరకు ఆహార భద్రత కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా లభిస్తాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు వెచ్చించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..