7th Pay Commission: దీపావళికి గుడ్ న్యూస్ వస్తుందా? కేంద్రం ప్రకటనపై ఉద్యోగుల భారీ ఆశలు..

|

Oct 03, 2024 | 6:22 PM

కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోయినా డీఏ పెంపుపై అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాటి ప్రకారం దీపావళికి ముందు డీఏ పెంపు వార్త వెలువడే అవకాశం ఉంది. ఈసారి 3 నుంచి 4 శాతం పెంచుతారని భావిస్తున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.18 వేల బేసిక్ వేతనం కలిగిన ఎంట్రీ లెవల్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగికి నెలకు రూ.540 నుంచి రూ.720 మధ్య పెరిగే అవకాశం ఉంది.

7th Pay Commission: దీపావళికి గుడ్ న్యూస్ వస్తుందా? కేంద్రం ప్రకటనపై ఉద్యోగుల భారీ ఆశలు..
Cash
Follow us on

మన జీవన వ్యయాలు, ఖర్చులు ఏటేటా మారుతూ ఉంటాయి. పెరుగుతున్న ఖర్చులు, వివిధ అవసరాలకు అనుగుణంగా ఈ మార్పులు వస్తాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాల విషయంలో కూడా పెరుగుదల ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను ప్రకటిస్తారు. ఉద్యోగుల జీవనం వ్యయంలో ద్రవ్యోల్బణం లోటును పూడ్చడానికి దీన్నిపెంచుతారు. ఇది ఆ ఉద్యోగి వేతనంలో కలిసి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి డీఏను సర్దుబాటు చేస్తారు. ఏటా అక్టోబర్ లో పెంపు ప్రకటన విడుదల అవుతుంది. ఈ విషయంపై కేంద్రం చేసే ప్రకటన కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎంత పెరుగుతుందంటే..

కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోయినా డీఏ పెంపుపై అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాటి ప్రకారం దీపావళికి ముందు డీఏ పెంపు వార్త వెలువడే అవకాశం ఉంది. ఈసారి 3 నుంచి 4 శాతం పెంచుతారని భావిస్తున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.18 వేల బేసిక్ వేతనం కలిగిన ఎంట్రీ లెవల్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగికి నెలకు రూ.540 నుంచి రూ. 720 మధ్య పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక ఉద్యోగి మొత్తం జీతం నెలకు రూ.30 వేలు వస్తూ.. అతడి మూల వేతనం రూ.18 వేలు ఉంటే ప్రస్తుతం అతడు రూ.9వేలు డీఏ పొందుతుంటాడు. కేంద్ర ప్రభుత్వం మూడు శాతం డీఏ పెంచితే 9,540, నాలుగు శాతం పెంచి 9720 డీఏ అందుతుంది.

ఏడాదికి రెండుసార్లు..

సాధారణంగా ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ఇస్తారు. వీటిని ఏడాదికి రెండు సార్లు పెంచుతారు. ప్రస్తుతం కోటి మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులు 50 శాతం డీఏ పొందుతున్నారు. 2024 మార్చిలో కేంద్రం 4 డీఏను పెంచింది. ఆల్ ఇండియా కన్య్సూమర్ ప్రైస్ ఇండెక్స్‪లోని 12 నెలవారీ సగటు పెరుగుదల శాతం ఆధారంగా డీఏ, డీఆర్ పెంపుదలను సమీక్షిస్తారు. ఉద్యోగి ప్రాథమిక జీతంపై డీఏను లెక్కకడతారు. ఈ సమయంలో ఏ ఇతర భత్యం చేర్చబడదు.

8వ పే కమిషన్..

ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ (వేతన సంఘం)ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 7వ వేతన సంఘం 2014 ఫిబ్రవరిలో ఏర్పాటైంది. ఈ కమిషన్ సిఫార్సులను 2016 జనవరి 1 నుంచి అమలు చేశారు. ఈ సంఘం ఇప్పటికి దాదాపు పది ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 8వ పే కమిషన్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అయితే దీని ఏర్పాటుకు సంబంధించి స్పష్టత మాత్రం రాలేదు. 2024-25 కేంద్ర బడ్జెట్ లో 8వ పే కమిషన్ ప్రకటించలేదు. ఆ తర్వాత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో మాట్లాడుతూ 8వ పే కమిషన్ ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని స్పష్టంగా తెలిపారు.

మరింత పెరిగే అవకాశం..

8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తే ఉద్యోగులు జీతాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీసం వేతనం 1.92 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ తో రూ.34,560కి చేరుతుంది. కనీస పెన్షన్ కూడా రూ.17,280గా మంజూరు చేస్తారు. 7వ వేతన సంఘం సమయంలో 2016 లో జీతాలను 14.27 శాతానికి పెంచారు. అంతకు ముందుకు 6వ వేతన సంఘం సమయంలో 2006లో భారీగా 54 శాతం పెరిగాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..