Vivad se vishwas scheme: కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. దేశంలోని ప్రస్తుతం పరిస్తితుల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో.. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. వివాద్ సే విశ్వాస్ స్మీమ్ గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివాద్ సే విశ్వాస్ స్మీమ్ జూన్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. పన్ను చెల్లింపుదారులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజన పొందవచ్చు. అలాగే సాధారణంగా ఈ స్మీమ్ గడువు ఏప్రిల్ 30తో ముగియాల్సి ఉంది.
అయితే పన్ను చెల్లింపుదారులకు పన్ను అంశానికి సంబంధించి ఏమైనా వివాదాలు లేదా పాత బకాయిలు ఉంటే వాటన్నింటిని ఈ స్మీమ్ కింద్ సెటిల్ మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఒకేసారి కొంత పేమెంట్ చెల్లిస్తే సరిపోతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన చాలా మందికి ఊరట కలగనుంది. ఇక దేశంలో కరోనా విస్తరిన్ను నేపథ్యంలో రాష్ట్రా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించుకుంటాయి. ఈ క్రమంలోనే బ్యాంక్ పనివేళలు కూడా మారిన సంగతి తెలిసిందే.
ట్వీట్..
Govt extends certain timelines to 30.06.2021 where time limit was earlier extended to 30.04.2021 through various notifications issued under the Taxation and Other Laws (Relaxation) and Amendment of Certain Provisions Act, 2020
Read more➡️ https://t.co/a6sYFzuc6T pic.twitter.com/cucC2YfAKT
— Ministry of Finance (@FinMinIndia) April 24, 2021
Also Read: ఐడియా ఇవ్వు.. రూ.5 లక్షలు పట్టు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే..
HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..