
దేశంలో క్రికెట్, బాలీవుడ్ ప్రపంచంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వారికి పరిచయం అవసరం లేదు. దీంతో పాటు దేశ విదేశాల్లో ఇలాంటి సెలబ్రిటీలకు కోట్లాది మంది ఫాలోవర్లు, ఆరాధకులు ఉన్నారు. ఈ అభిమానులందరూ తమ అభిమాన సెలబ్రిటీకి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆరాట పడుతుంటారు. ఇందులో వారి ఇల్లు, జీవనశైలి నుంచి వారు వినియోగించే వాహనాల వరకు అన్నింటిని తెలుసుకోవాలని అనుకుంటారు. దాదాపు ప్రతి సెలబ్రిటీ.. తమకు స్టార్‌డమ్ వచ్చిన వెంటనే ఖరీదైన, విలాసవంతమైన వాహనాలలో తిరుగుతారు.
కాకపోతే మీరు ఆరాధించే సెలబ్రిటీలు సొంతం చేసుకున్న మొదటి కారు ఏంటో తెలుసుకోవాలని కోరుకుంటారు. కాబట్టి ఇవాళ మనం అలాంటి సెలబ్రిటీలు, వారి మొదటి కారు గురించి ఇక్కడ తెలుసకుందాం..
బాలీవుడ్‌లో బాద్‌షాగా పేరుగాంచిన షారుఖ్ ఖాన్ బీ టౌన్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు అతని వద్ద లగ్జరీ వాహనాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ, భారతదేశంలోని అతిపెద్ద చలనచిత్ర నటులలో ఒకరిగా షా మొదటి కారు మాత్రం మారుతి ఓమ్ని. ఇది షారుఖ్ ఖాన్ తల్లి అతనికి బహుమతిగా ఇచ్చింది.
బాలీవుడ్ చక్రవర్తిగా పిలువబడే అమితాబ్ బచ్చన్ వద్ద భారీ కార్ కలెక్షన్ ఉంది. అయితే అతని మొదటి కారు సెకండ్ హ్యాండ్ ఫియట్ 1100, ఇందులో 1089సీసీ-1221సీసీ ఇంజన్ ఉంది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అయితే అతను కలిగి ఉన్న మొదటి కారు ఫియట్ పద్మిని. ఇది 1964 , 2001 మధ్య ఉత్పత్తి చేయబడింది.
బాలీవుడ్‌లో భాయ్‌గా పిలుచుకునే సల్మాన్ ఖాన్ వద్ద అనేక విలాసవంతమైన కార్లు ఉన్నాయి. కానీ ఈ కండల వీరుడి మొదటి కారు మాత్రం సెకండ్ హ్యాండ్ ట్రయంఫ్ హెరాల్డ్, దీనిని రిషి కపూర్ చిత్రంలో ఉపయోగించారు. ఆ తర్వాత సల్మాన్ సలీం ఖాన్ ఈ కారును కొనుకొన్నారు.
సచిన్ టెండూల్కర్‌ను క్రికెట్ దేవుడు అని అంటారు. మాస్టర్ బ్లాస్టర్‌గా పేరుగాంచిన సచిన్ వద్ద 360 మోడెనా ఫెరారీ లాంటి సూపర్ కార్ కూడా ఉంది. అయితే అతని మొదటి కారు మారుతీ 800.
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ మొదటి కారు తెలుపు రంగు పాత తరం హోండా CR-V, అయితే ఇప్పుడు ఆమె కొత్త జీప్ కంపాస్‌లో ప్రయాణిస్తోంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం