Uber: ఉబర్‌లో అడ్వాన్స్‌డ్‌ టిప్స్‌ ఫీచర్.. సెంట్రల్ కన్స్యూమర్ నోటీసు జారీ!

Uber: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు టిప్‌్ వంటి పద్ధతులు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లోని ఒక పోస్ట్‌లో ..

Uber: ఉబర్‌లో అడ్వాన్స్‌డ్‌ టిప్స్‌ ఫీచర్.. సెంట్రల్ కన్స్యూమర్ నోటీసు జారీ!

Updated on: May 23, 2025 | 8:24 PM

ఉబర్ తన అడ్వాన్స్‌డ్ టిప్ ఫీచర్‌కు సంబంధించి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసు జారీ చేసింది. ఈ ఫీచర్ కింద, వేగవంతమైన సేవ పేరుతో కస్టమర్ల నుండి టిప్స్‌ తీసుకుంటున్నారు. దీనిని CCPA అన్యాయమైన వ్యాపార పద్ధతిగా వర్గీకరించింది. ఈ ఫీచర్‌పై CCPA ఉబర్ నుండి వివరణ కోరింది. అలాగే ఇది అదనపు ఛార్జీల కోసం కస్టమర్లపై ఒత్తిడి తెస్తున్నట్లుగా పేర్కొంది.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు టిప్‌్ వంటి పద్ధతులు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లోని ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. వేగవంతమైన సర్వీస్‌ పేరుతో కస్టమర్లను ముందస్తుగా టిప్ ఇవ్వమని బలవంతం చేయడం లేదా ప్రేరేపించడం అనైతికమైనది.. దోపిడీకి దారితీస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రవర్తన స్పష్టంగా అన్యాయమైన వాణిజ్య పద్ధతి. ఈ విషయంపై CCPA దృష్టి సారించింది. ఆ తర్వాత అధికారం ఉబర్‌కు నోటీసు పంపి సమాధానం కోరిందని మంత్రి చెప్పారు. కస్టమర్ సంబంధిత సేవలన్నింటిలోనూ న్యాయంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేలా చూసుకోవాలని ఆయన అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి