దేశంలో వివిధ అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రంగానికి చెందిన అంశాలలో ఎక్కువగా మార్పులు చేసుకుంటున్నాయి. ఆదాయపు పన్ను శాఖలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ విషయంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండటం చాలా ముఖ్యం. అయితే కొన్ని అంశాలలో ట్యాక్స్ మినహాయింపు వెసులుబాటు ఉంటుంది. అలాంటి విషయాలపై వినియోగదారులు ఓ కన్నేయడం చాలా ముఖ్యం. ఇక ఈ రోజుల్లో చాలా మంది జీవిత బీమా పాలసీలు తీసుకుంటారు. పాలసీల ప్రీమియంపై కూడా పన్ను ఉంటుంది. అయితే ఈ జీవిత బీమా పాలసీకి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనను విడుదల చేసింది. జీవిత బీమా పాలసీ ప్రీమియంపై రూ. 5 లక్షల కంటే ఎక్కువ చెల్లించిన వారికి ఈ నియమం వర్తిస్తుంది. సీబీడీటీ ఆదాయపు పన్ను సవరణ నిబంధన 2023ని మార్చడం ద్వారా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రూల్ ప్రకారం.. ఇప్పుడు బీమా పాలసీలో 5 లక్షల కంటే ఎక్కువ మొత్తానికి పన్ను మినహాయింపు ఉండదు. మరోవైపు, ఎవరైనా ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత అటువంటి పాలసీని తీసుకున్నట్లయితే, దానికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ విషయంలో సీబీడీటీ ఎలాంటి విషయాలు తెలిపిందే చూద్దాం.
ఆదాయపు పన్ను చేసిన మార్పుల ప్రకారం.. ఏప్రిల్ 1, 2023న లేదా తర్వాత జారీ చేయబడిన పాలసీలపై సెక్షన్ 10(10D) కింద మెచ్యూరిటీ ప్రయోజనంపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక వ్యక్తి సంవత్సరానికి చెల్లించే మొత్తం ప్రీమియం రూ. రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే దానిపై పన్ను విధిస్తారు. 5 లక్షలపై పన్ను చెల్లించే వినియోగదారులు ఈ విషయం తప్పకుండా గుర్తించుకోవాలి.
ఇది కాకుండా ఐదు లక్షల కంటే ఎక్కువ ప్రీమియం చెల్లింపు ఆదాయం నుంచి లెక్కించి పన్ను విధిస్తారు. యులిప్‌లు మినహా జీవిత బీమా పాలసీలకు సంబంధించి పన్ను నిబంధనలో మార్పులు 2023-24 యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించబడ్డాయి. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ ప్రీమియంపై చెల్లించిన మొత్తం నుంచి వచ్చే ఆదాయాన్ని లెక్కించిన తర్వాత పన్ను విధిస్తారు. ఈ పన్ను మెచ్యూరిటీపై లెక్కించబడుతుంది. అలాగే తర్వాత మొత్తం చెల్లింపు ఉంటుంది. అదే సమయంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు పొందే ప్రీమియం మొత్తంపై పన్ను విధించబడదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి