Caya Bicycle సైకిల్ ప్రేమికులూ మీకు ఈ బ్రాండ్ గురించి తెలుసా? అదిరిపోయే డిస్కౌంట్స్ తో మేకిన్ ఇండియా సైకిల్స్..

కాయా సైకిల్స్ అనే దేశీయ బ్రాండ్ మార్కెట్ లోకి వచ్చింది. మేకిన్ ఇండియా నినాదంతో వచ్చిన ఈ సైకిల్స్ 4.0 రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి. చూడడాని సూపర్ బ్రాండ్ సైకిల్స్ గా కనిపించడమే కాక ధర కూడా ఇతర బ్రాండ్స్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి.

Caya Bicycle సైకిల్ ప్రేమికులూ మీకు ఈ బ్రాండ్ గురించి తెలుసా? అదిరిపోయే డిస్కౌంట్స్ తో మేకిన్ ఇండియా సైకిల్స్..
Caya

Edited By: Anil kumar poka

Updated on: Jan 11, 2023 | 3:00 PM

ఆరోగ్య రక్షణకు వ్యాయామం తప్పనిసరని అందరికీ తెలుసు. ప్రతి చిన్న విషయానికి బైక్ వాడడం తప్పనిసరైంది. దాని వల్ల మనకు శారీరక వ్యాయామం లేకపోవడంతో పాటు కాలుష్యాన్ని కూడా పెంచుతామని తెలిసినా తప్పని పరిస్థితుల్లో బైక్ వాడాల్సి వస్తుందని సమర్థించుకుంటాం. నిపుణులు మాత్రం డైలీ సైక్లింగ్ చేస్తే వ్యాయామపరంగా చాలా లాభాలుంటాయని తెలుపుతున్నారు. దీంతో కొంత మంది సైక్లింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే దాని ధర విషయంలో కాస్త వెనక్కితగ్గాల్సి వస్తుంది. తక్కువ ధరకు వచ్చిన సైకిల్స్ కొంటే వాటితో ఇబ్బందిపడతామని మొత్తానికి సైకిల్స్ కొనడమే ఆపేస్తాం. కానీ ఇలాంటి వారి గురించి కాయా సైకిల్స్ అనే దేశీయ బ్రాండ్ మార్కెట్ లోకి వచ్చింది. మేకిన్ ఇండియా నినాదంతో వచ్చిన ఈ సైకిల్స్ 4.0 రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి. చూడడాని సూపర్ బ్రాండ్ సైకిల్స్ గా కనిపించడమే కాక ధర కూడా ఇతర బ్రాండ్స్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అడల్ట్ సైకిల్స్, కిడ్స్ సైకిల్స్ లో కొత్తదనాన్ని పరిచయం చేస్తున్నాయి. అలాగే డిస్క్ బ్రేక్స్, సూపర్ సస్పెన్షన్ తో ఇవి వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. కాయా తక్కువ ధరలో అందించే కొన్ని మోడల్స్ ను చూద్దాం.

కాయా వారియర్ 26 రోడ్ బైక్

కాయా సైకిల్స్ 90 శాతం అసెంబుల్డ్ చేసి యూజర్ ఫ్రెండ్లీగా అందుబాటులో ఉంటాయి. ఈ కాయా వారియర్ 26 అడల్ట్స్ కోసం రూపొందించింది. స్టీల్ ఫ్రేమింగ్ తో స్టైలిష్ ఆర్మీ గ్రాఫిక్స్ తో వస్తుంది. డ్కుయల్ డిస్క్ బ్రేకింగ్ తో వస్తున్న ఈ సైకిల్ ధర రూ.10499. ఆకర్షనీయమైన గ్రిప్ తో వస్తున్న ఈ రోడ్ బైక్ దాదాపు 23 శాతం తగ్గింపు కంపెనీ ఆఫర్ చేస్తుంది.

కాయా యూనిసెక్స్ ట్యుబులర్ 24టి

ఈ మోడల్ సైకిల్ డబుల్ వాల్ ఆలోయ్ వీల్స్ తో వస్తుంది. ఇది ముఖ్యంగా యువ రైడర్స్ ను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేసిన మోడల్. ఇది 24 అంగుళాల టైర్ తో వస్తుంది. సౌకర్యవంతమైన అమెరికన్ వాల్వ్ ట్యూబ్ లతో వస్తున్న ఈ బైక్ ధర రూ.10,299. ఇది 11 శాతం తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కాయా స్ప్లిట్ 27.5

ఈ సైకిల్ రెండు గేర్లతో వస్తుంది. ఒకటి 21 స్పీడ్ మైక్రోషిఫ్ట్, మరొకటి నో గేర్ ఎంపిక. దీని ధర రూ.15,190. ఇది 21 శాతం తగ్గింపుతో వస్తుంది. ఆకర్షణీయమైన గ్రిప్ లు, అద్భుతమైన రోల్ ను అందించే విస్తృత టైర్ లు అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది.

కాయా స్ప్లిట్ 29 

ఈ సైకిల్ ను వినియోగదారులు బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ సైకిల్ పై ఎంతసేపైనా సులభంగా రైడ్ చేయవచ్చు. ఈ సైకిల్ 22 శాతం తగ్గింపుతో రూ.15,665 ధరలో అందుబాటులో ఉంది. ఈ సైకిల్ తేలికగా ఉండడంతో రైడర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..