Holi 2025: హోలీ సందడిలో కార్ల రక్షణ కీలకం.. ఈ టిప్స్ పాటిస్తే ఆ సమస్యలు ఫసక్

దేశంలో హోలీ సందడి మొదలైంది. శుక్రవారం జరగనున్న హోలీను సందడి చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రంగులతో పాటు వాటిని చల్లేందుకు అవసరమైన సామగ్రిని కూడా చాలా మంది కొనుగోలు చేసుకున్నారు. అయితే హోలీ సందడి ఎలా ఉన్నా ఆ రంగుల్లో మనం ఎంతో ఇష్టపడే కారుపై పడితే సందడి అనంతరం చాలా బాధపడాల్సి వస్తుంది. అందువల్ల హోలీ సమయంలో కార్ల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం.

Holi 2025: హోలీ సందడిలో కార్ల రక్షణ కీలకం.. ఈ టిప్స్ పాటిస్తే ఆ సమస్యలు ఫసక్
Holi Car Cleaning

Updated on: Mar 13, 2025 | 4:53 PM

హెూలీ అంటే ప్రజలు సరదాగా గడుపుతూ రంగులతో తడిసి ముద్దవుతారు. కానీ సాధారణంగా హెూలీ పండుగలో సందడి ఎలా ఉన్నా కార్ల యజమానులు మాత్రం చాలా భయపడుతూ ఉంటారు. కార్లపై పడిన రంగులు మచ్చలుగా మారి కారు అందాన్ని నాశనం చేస్తాయి. కారు రక్షణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఏదో రకంగా కారుపై రంగులు పడుతూ ఉంటాయి. కొన్ని మరకలైన ఎంతో నైపుణ్యం కలిగిన కార్ డిటెయిలర్లు తొలగించలేనంతగా మారతాయి. కాబట్టి హెూలీ తర్వాత కూడా మీ కారును మరకలు లేకుండా ఉంచడానికి సహాయపడే చిట్కాలను చూద్దాం.

కారు రక్షణ

కారుపై రంగులు పడిన తర్వాత వాటిని శుభ్రం చేయించుకునేందుకు కష్టపడే బదులు రంగులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కారును క్లోజ్‌డ్ షెడ్స్‌లో పార్క్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. క్లోజ్‌డ్ షెడ్ అందుబాటులో లేకపోతే కారును పూర్తిగా కవర్ చేసేలా కారు కవర్‌ను ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా హెూలీ ఆడుతున్న జనసమూహాలకు దూరంగా కారును పార్క్ చేయడం ఉత్తమం.

కారు వ్యాక్స్ 

కారు కొనుగోలు చేసిన వెంటనే కారుకు వ్యాక్స్ చేయిస్తే ఇలాంటి సమయంలో రంగుల నుంచి రక్షణ లభిస్తుంది. కారు వ్యాక్స్ అంటే మైనం ద్వారా కారు పెయింట్ అదనపు రక్షణ పొరను జోడించడం. ఇలా చేస్తే ఏదైనా మరకలు పడితే వ్యాక్స్ చేసిన అవుటర్ పార్ట్ నుంచి మరకలను తొలగించడం సులభంగా ఉంటుంది. అంతేకాకుండా పక్షి రెట్టలు, ఎండ నుంచి అదనపు రక్షణ లభిస్తుంది. 

ఇవి కూడా చదవండి

విండోలను రోల్ అప్ చేయడం

మీరు కారును ఎక్కడ పార్క్ చేసినా కిటికీలను పైకి లేపడానికి చాలా ప్రాథమిక విధానాన్ని అనుసరించడం మంచిది. హెూలీకి మాత్రమే కాకుండా అన్ని సమయాల్లో ఇదే విధానం అనుసరించడం ఉత్తమం. అయితే కిటికీలను పైకి లేపడం వల్ల రంగు, నీరు కారు క్యాబిన్‌లోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు. అలాగే దుమ్ము, కీటకాలు నుంచి రక్షణ ఉంటుంది. 

ఇంటీరియర్ రక్షణ

హోలీ సంబరాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తడిసిన దుస్తులను ధరించి కారులోకి ఎక్కకూడదు. కాబట్టి వీలైనంతగా దుస్తులను మార్చుకుని కారు ఎక్కడం ఉత్తమం. కుదరని పక్షంలో మీ కారు సీట్లను టవల్‌తో కప్పి వినియోగించడం ఉత్తమం. హోలీ రంగుల వల్ల ఇబ్బంది లేకుండా డాష్ బోర్డ్‌ను క్లింగ్ ర్యాప్ లేదా ప్లాస్టిక్ షీట్‌తో కప్పాలి.

కారును వెంటనే కడగడం

మీ వాహనం బయట లేదా లోపలి భాగంలో మరకలు పడితే వీలైనంత త్వరగా కారును బాగా కడగాలి. షాంపూతో పాటు నీటి సాయంతో వెంటనే శుభ్రం చేస్తే మచ్చల పడకుండా ఉంటాయి. అలాగే ఇంటీరియర్ విషయంలో తగిన జాగ్రత్తలతో క్లీన్ చేయడం ఉత్తమం. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..