Telugu News Business Cancelling train tickets? Indian Railways has just changed the cancellation charges
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారా? ఇక కొత్త రూల్స్!
Indian Railways: భారత రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక టికెట్ విధానంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తోంది. ఇక టికెట్ క్యాన్సిలేషన్ విధానంలో కీలక మార్పులు చేస్తోంది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి దశల వారిగా అమలు చేయనున్నారు..
Indian Railways: భారత రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. రైలు బయలుదేరే సమయాన్ని ఆధారంగా చేసుకుని రిఫండ్ విధానాన్ని సవరించింది. ఈ కొత్త మార్పులను రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దశలవారీగా అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనలు:
72 గంటల ముందు క్యాన్సిలేషన్: ప్రయాణానికి 72 గంటల ముందే కన్ఫామ్ టికెట్ రద్దు చేస్తే గరిష్ట రిఫండ్ లభిస్తుంది. అయితే కొంత క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి మిగతా మొత్తాన్ని తిరిగి ఇస్తారు.
72 నుంచి 24 గంటల మధ్య: ఈ సమయంలో టికెట్ రద్దు చేస్తే ‘స్టాండర్డ్ పెనాల్టీ’ వర్తిస్తుంది. టికెట్ ధరలో సుమారు 25% కోత విధించి మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు.
24 నుంచి 8 గంటల మధ్య: ఇది ‘లేట్ క్యాన్సిలేషన్’గా పరిగణిస్తారు. టికెట్ ధరలో 50% కోత విధించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు.
8 గంటల లోపు లేదా ట్రైన్ బయల్దేరిన తర్వాత: ఈ సమయంలో టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ ఉండదు.
ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు:
బోర్డింగ్ పాయింట్ మార్పు: ఇప్పుడు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే అవకాశం ఉంది.
కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్: ఇప్పటివరకు ట్రైన్ ప్రారంభ స్టేషన్‌లో మాత్రమే క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండగా, ఇకపై ఏ స్టేషన్‌లోనైనా రద్దు చేసుకోవచ్చు.
TDR ఆటోమేటిక్ రిఫండ్: ఇ-టికెట్ కలిగిన ప్రయాణికులు ఇకపై మాన్యువల్‌గా TDR ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌గా రిఫండ్ ప్రాసెస్ అవుతుంది.
ట్రావెల్ క్లాస్ అప్‌గ్రేడ్: కౌంటర్ టికెట్ ఉన్నవారు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు తమ క్లాస్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న క్యాన్సిలేషన్ ఛార్జీలు:
ఏసీ ఎగ్జిక్యూటివ్ / ఫస్ట్ క్లాస్: రూ.240 + GST
ఏసీ 2 టైర్: రూ.200 + GST
ఏసీ 3 టైర్ / ఛైర్ కార్: రూ.180 + GST
స్లీపర్: రూ.120
సెకండ్ క్లాస్: రూ.60
సమయం ఆధారంగా రిఫండ్ (పాత విధానం):
48 గంటల ముందు: ఫిక్స్‌డ్ ఛార్జీలు
48–12 గంటల మధ్య: 25% కోత
12–4 గంటల మధ్య: 50% కోత
4 గంటల లోపు: రిఫండ్ లేదు
మొత్తం మీద ఈ మార్పులు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగించేలా, రిఫండ్ ప్రక్రియను సులభతరం చేసేలా రూపొందించారు.