AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రెడిట్ కార్డుతో బంగారం కొంటే ఏమవుతుంది..? ఈ రూల్స్ తెలియకపోతే జేబుకు చిల్లే..

చేతిలో డబ్బులు లేకపోయినా పండగకో, పెళ్లికో బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈజీగా గోల్డ్ షాపింగ్ చేయొచ్చు కదా అని ధీమాగా ఉన్నారా? అయితే ఆగండి.. మీ క్రెడిట్ కార్డుతో బంగారం కొనేముందు కొన్ని రూల్స్ తెలుసుకోకపోతే, మీరు నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉంది.

క్రెడిట్ కార్డుతో బంగారం కొంటే ఏమవుతుంది..? ఈ రూల్స్ తెలియకపోతే జేబుకు చిల్లే..
Can You Buy Gold With A Credit Card
Krishna S
|

Updated on: Jul 19, 2026 | 8:14 PM

Share

భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్, అత్యంత నమ్మకమైన పెట్టుబడి. అందుకే చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా.. పండగలు, పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు ఏదో ఒక రూపంలో బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది చేతిలో నగదు లేనప్పుడు బంగారం కొనడానికి క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అసలు క్రెడిట్ కార్డ్ ద్వారా బంగారం కొనడం సాధ్యమేనా? ఒకవేళ కొంటే ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి? అనే విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

క్రెడిట్ కార్డుతో బంగారం కొనవచ్చా?

ఖచ్చితంగా కొనవచ్చు.. ప్రస్తుత రోజుల్లో దాదాపు అన్ని ప్రముఖ నగల దుకాణాలు, ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్లు క్రెడిట్ కార్డుల ద్వారా బంగారం కొనుగోలు చేయడానికి అనుమతిస్తున్నాయి. చేతిలో తక్షణమే నగదు లేని వారికి ఇదొక సులువైన మార్గంగా కనిపిస్తుంది. అయితే ఈ సౌకర్యం, పరిమితులు అనేవి మీరు వాడుతున్న క్రెడిట్ కార్డ్ కంపెనీ లేదా బ్యాంకును బట్టి మారుతుంటాయి.

క్రెడిట్ కార్డుతో బంగారం కొనే ముందు ఈ 4 విషయాలు గమనించండి..

పరిమితులు – ప్రత్యేక నిబంధనలు:

ప్రతి బ్యాంకుకు తమ క్రెడిట్ కార్డులపై బంగారం కొనుగోలు చేయడానికి కొన్ని స్వంత నియమాలు ఉంటాయి. పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు మీ కార్డుపై ఉన్న రోజువారీ లేదా నెలవారీ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏంటో ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మర్చంట్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు

చాలా నగల దుకాణాలు క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ కోసం 1 నుండి 2శాతం వరకు అదనపు మర్చంట్ ఫీజును కస్టమర్ల నుండే వసూలు చేస్తుంటాయి. దీనివల్ల మీరు కొనే బంగారం ధర మరింత పెరుగుతుంది.

నో క్యాష్‌బ్యాక్ రూల్స్

సాధారణంగా క్రెడిట్ కార్డులపై షాపింగ్ చేస్తే క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లు వస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో చాలా బ్యాంకులు బంగారం కొనుగోళ్లపై రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పూర్తిగా నిలిపివేశాయి.

EMIగా మార్చుకుంటే వచ్చే సమస్యలు

క్రెడిట్ కార్డుతో బంగారం కొని, ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించలేక EMIగా మార్చుకుంటే బ్యాంకులు భారీగా వడ్డీ వసూలు చేస్తాయి. ప్రాసెసింగ్ ఫీజులతో పాటు 14శాతం నుండి 18శాతం వరకు వడ్డీ పడటం వల్ల పెట్టుబడిగా కొనే బంగారం మీకు నష్టాన్ని మిగుల్చుతుంది.

క్రెడిట్ కార్డులు అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చడానికి, ఆఫర్ల ద్వారా డబ్బు ఆదా చేయడానికి మంచి సాధనాలే. కానీ, వాటిని ఉపయోగించి అనవసరంగా అప్పుల్లో కూరుకుపోకూడదు. బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు, క్రెడిట్ కార్డులపై ఆధారపడటం కంటే.. ముందే డబ్బు దాచుకుని కొనడమే అత్యంత సురక్షితమైన మార్గమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us