
దుబాయ్..అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే అక్కడ బంగారం ధరలు తక్కువగా ఉంటాయని..అంతేకాదు.. అధిక స్వచ్ఛత కలిగిన బంగారం లభిస్తుందని. భారతదేశంతో పోలిస్తే దుబాయ్‌లో బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఇంకా, ఆభరణాల తయారీ ఛార్జీలు కూడా అక్కడ తక్కువగా ఉన్నాయి. అందుకే దుబాయ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చే చాలా మంది ప్రయాణికులు తప్పనిసరిగా గల్ఫ్ నగరంలో బంగారం కొనుగోలు చేస్తారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. పసిడి ధరలు ముట్టుకోకుండానే షాక్ కొడుతున్నాయి. దాంతో ప్రజల ఆలోచనలు కూడా మారాయి..గల్ఫ్ నగరంలో గోల్డ్ కొని భారతదేశంలో అమ్మడం ద్వారా లాభం పొందవచ్చా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ, సరించిన బ్యాగేజ్ రూల్స్ 2026 ప్రకారం, ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం అక్కడ నివసించిన తరువాత దుబాయ్ నుండి తిరిగి వచ్చే ప్రయాణికులు 40 గ్రాముల వరకు సుంకం లేని బంగారు ఆభరణాలను తీసుకురావచ్చు. ఆభరణాలపై మాత్రమే సుంకం లేని మినహాయింపు ఉంటుందని మర్చిపోవద్దు. మీరు బంగారు నాణేలు, బిస్కెట్స్ వంటివి తీసుకువస్తే మీరు మొదటి గ్రాముకు కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, మీలో ఎవరైనా దుబాయ్ నుండి బంగారం కొని భారతదేశంలో అమ్మాలని ఆలోచిస్తుంటే కీలకమైన ఐదు అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
దుబాయ్‌లో బంగారం ధరలు సాధారణంగా భారతదేశంలో కంటే 5శాతం నుండి 7శాతం తక్కువగా ఉంటాయి. దుబాయ్‌లో బంగారం చౌకగా ఉండటానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, అక్కడ బంగారంపై GST లేదు, అయితే భారతదేశంలో 3శాతం GST తప్పనిసరి. రెండవది, దుబాయ్‌లో తయారీ ఛార్జీలు కూడా చాలా తక్కువ. భారతదేశంలో, బంగారు ఆభరణాల తయారీ ఛార్జీ సగటున 12శాతం ఉండగా, దుబాయ్‌లో ఇది కేవలం 8శాతం మాత్రమే. దుబాయ్ నుండి భారతదేశానికి మీకు కావలసినంత బంగారం లేదా ఆభరణాలను తీసుకురావడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. దీనికి ఒక పరిమితి ఉంది. మీరు పరిమితి కంటే ఎక్కువ బంగారం తీసుకువస్తే, మీరు తప్పనిసరిగా కస్టమ్స్ సుంకం చెల్లించాలి.
సమాచారం ప్రకారం..మీరు కేవలం దుబాయ్ పర్యటన కోసం వెళ్లి బంగారం కొనుగోలు చేయాలంటే మాత్రం పన్ను తప్పనిసరి. మీరు ఎంత బంగారం కొంటున్నారు అనే అంశం ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన ప్రతి బంగారు ఆభరణానికి సంబంధించి చెల్లుబాటు అయ్యే బిల్లును తప్పనిసరిగా జతచేసి కస్టమ్స్ వద్ద చూపించాల్సి ఉంటుంది. ఇకపోతే, ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విదేశాలలో నివసిస్తున్న భారతీయ ప్రయాణికుడు పరిమిత మొత్తంలో బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చు. పురుషులకు 20 గ్రాముల వరకు, మహిళలకు 40 గ్రాముల వరకు అనుమతి లభిస్తుంది. ఇది కూడా కేవలం ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. బంగారు కడ్డీలు, నాణేలు మొదటి గ్రాము నుండి కస్టమ్స్ సుంకాన్ని కట్టాల్సి ఉంటుంది.
దుబాయ్ నుండి భారతదేశానికి గోల్డ్ తీసుకురావాలంటే ఏయే ఛార్జీలు చెల్లించాలి?
డ్యూటీ-ఫ్రీ జ్యువెలరీ అలవెన్స్ కంటే ఎక్కువ బంగారాన్ని తీసుకెళ్లే ప్రయాణికులు టైర్డ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను పాటించాల్సి ఉంటుంది. ఇది దాదాపు 3శాతం నుండి ప్రారంభమై 6శాతం, ఎక్కువ అంటే 10శాతం వరకు పెరుగుతుంది. బంగారు కడ్డీలు లేదా నాణేలు అర్హత కలిగిన ప్రయాణీకులకు అంటే ఆరు నెలల పాటు విదేశాలలో ఉంటున్నవారు రాయితీతో కూడిన 6శాతం సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే తక్కువ కాలం ఉండివెళ్తున్న పర్యాటకులు దాదాపు 36–38.5శాతం వరకు ఎక్కువ సుంకాలను భరించాల్సి ఉంటుంది. భారతదేశంలో అమ్మకంలో 3శాతం GST వర్తిస్తుంది. AED-to-INR మార్పిడి ఖర్చులు కలుపుకుని ఉంటుంది. కొనుగోలుదారులు కరెన్సీ మార్పిడి ఖర్చులను కూడా భరించాల్సి ఉంటుంది. తరువాత విక్రయిస్తే, హోల్డింగ్ వ్యవధిని బట్టి మూలధన లాభాల పన్ను వర్తించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఎలాంటి జరిమానాలు లేకుండా ఉండాలంటే, సరైన రషీదులు, డాక్యుమెంటేషన్ తప్పనిసరి.
భారతదేశంలో అమ్మడానికి దుబాయ్ నుండి బంగారం కొనుగోలు చేస్తే లాభమేనా..? అంటే.. బంగారం ధరల అస్థిరత, కరెన్సీ కదలికలు మార్జిన్లను తగ్గించేవిగా కీలక నష్టాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. చట్టపరమైన, అన్ని రకాల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు దొర్లినా కూడా అది భారీ నష్టానికి దారి తీస్తుంది. భారీ జరిమానాతో పాటు బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
దుబాయ్‌లో రూ.20 లక్షల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసి భారతదేశంలో అమ్మడం వాణిజ్యపరంగా లాభదాయకమేనా? అంటే..వ్యాపారులు కాకుండా వ్యక్తులకు ఇటువంటి పద్ధతి లాభదాయకం కాదని చెబుతున్నారు. ఎందుకంటే.. అంతేకాదు, భారత్‌లో అమ్మేటప్పుడు జువెలర్లు బిల్, ప్యూరిటీ సర్టిఫికెట్ అడగవచ్చు. కొన్ని సందర్భాల్లో విదేశీ బంగారాన్ని మార్కెట్ ధరకన్నా తక్కువకే కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కస్టమ్స్ సుంకం, GST, కరెన్సీ మార్పిడి ఖర్చులలు కలుపుకుని మార్జిన్లు తక్కువగా ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. లాభాలు బంగారం ధర పెరుగుదలపై ఆధారపడి ఉంటాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేసి భారత్‌లో అమ్మితే రిస్క్ లేకుండా భారీ లాభం వస్తుంది అనే భావన వాస్తవానికి విరుద్ధం. డ్యూటీలు, పన్నులు, ధరల ఊగిసలాట అన్నీ కలిపితే లాభం చాలా పరిమితంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఇన్వెస్ట్‌మెంట్ కోణంలో చూస్తే గోల్డ్ ETFలు లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి భద్రమైన మార్గాలే మంచివని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..