BYD Seal: కియా, బీఎండబ్ల్యూ ఈవీలకు గట్టి పోటినిస్తున్న బీవైడీ.. అదరగొట్టే లేటెస్ట్ ఫీచర్లతో మరో ఈవీ కారు సిద్ధం..!

|

Feb 16, 2024 | 1:30 PM

తాజాగా ప్రముఖ ఈవీ కారు తయారీ కంపెనీ అయిన బీవైడీ భారతదేశంలో తన మూడో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది. చైనీస్ ఈవీ దిగ్గజం సీల్ ఎలక్ట్రిక్ సెడాడ్‌ను మార్చి 5న విడుదల చేస్తుంది. భారతదేశం కోసం బీవైడీకు సంబంధించిన ఈవీ లైనప్‌లో సీల్ అటో 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, 86 ఎలక్ట్రిక్ ఎంపీవీలో చేరనుంది. గతేడాది జనవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పో సీల్ ఈవీని తొలిసారిగా ప్రదర్శించారు.

BYD Seal: కియా, బీఎండబ్ల్యూ ఈవీలకు గట్టి పోటినిస్తున్న బీవైడీ.. అదరగొట్టే లేటెస్ట్ ఫీచర్లతో మరో ఈవీ కారు సిద్ధం..!
Byd Seal
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. భారతదేశంలో కూడా ఈవీ వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీల దగ్గర నుంచి టాప్ కంపెనీల వరకూ తమ మోడల్ ఈవీలను భారత మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ కారు తయారీ కంపెనీ అయిన బీవైడీ భారతదేశంలో తన మూడో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది. చైనీస్ ఈవీ దిగ్గజం సీల్ ఎలక్ట్రిక్ సెడాడ్‌ను మార్చి 5న విడుదల చేస్తుంది. భారతదేశం కోసం బీవైడీకు సంబంధించిన ఈవీ లైనప్‌లో సీల్ అటో 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, 86 ఎలక్ట్రిక్ ఎంపీవీలో చేరనుంది. గతేడాది జనవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పో సీల్ ఈవీని తొలిసారిగా ప్రదర్శించారు. ముందుగా పండుగ సీజన్‌లోలాంచ్ చేయాలని అనుకున్నా వాయిదా పడింది.బీవైడీ సీల్ ఆటో 3కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బీవైడీ సీల్ టెస్లా మోడల్ 3కి గట్టి పోటినిస్తుంది. సీల్ ఈవీ పొడవు 4,800 ఎంఎం, వెడల్పు 1,875 ఎంఎం, ఎత్తు 1,460 ఎంఎంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఈవీ తయారీదారుకు సంబంధించిన అంకితమైన ఈ-ప్లాట్ఫారమ్ 3.0 ఆధారంగా రూపొందించారు. బీవైడీ సీల్ ఈవీవ రూపకల్పన 2021లో ప్రదర్శించబడిన ఓషన్ ఎక్స్ కాన్సెప్ట్ ద్వారా ప్రభావితమైంది. ఈ కారు ఏరోడైనమిక్ బాడీనితో వస్తుంది. ఇది కేవలం 0.21 సీడీకు సంబంధించిన డ్రాగ్ కోఎఫీషియంట్‌ను వాగ్దానం చేస్తుంది. లుక్స్ పరంగా సీల్  ఎల్ఈడీ-డీఆర్ఎల్‌తో క్రిస్టల్ ఎల్ఈడీ హెర్‌ ల్యాంప్లతో వస్తుంది. ఈ కారు ఇంటీరియర్ విషయానికి వస్తే సీల్ ప్రీమియం లుక్, సాఫ్ట్-టచ్ మెటీరియల్‌తో వస్తుంది. డ్యాష్ బోర్డ్ 15.6 అంగుళాల రొటేటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆకర్షిస్తుంది. 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేతో పాటు హెడ్-అప్ డిస్ప్లే, రెండు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ల‌తో ఇంటీరియర్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. 

బీవైడీ సీల్ ఈవీ బ్లేడ్ బ్యాటరీ సాంకేతికతతో వస్తుంి. ఇది గ్లోబల్ మార్కెట్లలో రెండు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. 61.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ద్వారా ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిమీల పరిధిని అందిస్తుంది. మరో బ్యాటరీ 82.5 కేడబ్ల్యూహెచ్ యూనిట్ ద్వారా ఒకే ఛార్జ్ పై 700 కిమీ పరిధిని అందిస్తుంది. బీవైడీ 150 కేబ్య్లూ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. అయితే చిన్న ప్యాక్ 110 కేడబ్ల్యూ వరకు ఫాస్ట్ ఛార్జర్లకు అనుకూలంగా ఉంటుంది. భారతీయ రోడ్లపై అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ కార్లలో సీల్ కూడా ఒకటి. ఇది గత సంవత్సరం యూరో ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ఆకట్టుకుంది. సీల్ ఈవీ ఒకే పీఎంఎస్, డ్యూయల్-మోటార్ ఎంపికల ద్వారా అందుబాటులో ఉంటుంది. భారతదేశం ఆఫర్‌లతో కలిపి 523 బీహెచ్‌పీ మరింత శక్తివంతమైన డ్యూయల్-మోటార్ వెర్షన్‌ అందుబాటులో ఉంటుంది. ఈ కారు 0-100 కేఎంపీహెచ్ వేగాన్ని 3.8 సెకన్లలో అందుకుంటుంది. అలాగే ఈ కారు మార్చి 5న భారత మార్కెట్‌లో లాంచ్ కానుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి