భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత సేవింగ్ చేస్తూ ఉంటారు. వారి, వారి ఆదాయాలకు అనుగుణంగా డబ్బులను పొదపు చేస్తుంటారు. అందులోనూ రిస్క్ తక్కువగా ఉండీ మంచి లాభాలు వచ్చే వాటిపై దృష్టిసారిస్తుంటాం. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ అదిరిపోయే ప్లాన్స్‌ను అందిస్తోంది. ఇలాంటి వాటిలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి.
ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల తక్కువ రిస్క్‌తో మంచి రిటర్న్స్‌ను పొందొచ్చు. రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా 6.5 శాతం వడ్డీ రేటను పొందుతారు. ఈ పథకంలో మీరు రూ.100 నుంచి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, గరిష్ట పరిమితి అంటూ ఏం లేదు. ఇందు కోసం సింగల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ పథకంలో ప్రతీ నెల డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది.
ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కనీసం 5 ఏళ్లు పెట్టుబడి పెడుతూ ఉండాలి. తర్వాత మీ డబ్బులను ఒకేసారి చెల్లిస్తారు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం ఆధారంగా మీరు రిటర్న్స్ పొందుతారు. ఉదాహరణకు మీరు నెలకు రూ. వెయ్యి పెట్టుబడి పెడుతూ పోతూ రూ. 5 లక్షలు ఎలా సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లకు రూ. 60000 అవుతుంది. మీకు వడ్డీ రూపంలో రూ. 11000 జమ అవుతాయి.
ఒకవేళ పెట్టుబడిని మరో 5 ఏళ్లు పొడగిస్తే.. మీ డిపాజిట్ మొత్తం రూ. 1.2 లక్షలకు చేరుతుంది. దానికి వడ్డీతో కలిపి మొత్తం 1.69 లక్షలు వస్తాయి. ఇలాగే మరో ఐదేళ్లు పెట్టుబడి పెడితే.. అప్పుడు మీరు రూ. 2.4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా మీరు 20 ఏళ్లు పెట్టుబడి పెడితే మీరు ఏకంగా రూ. 5 లక్షలు సొంతం చేసుకోవచ్చు. 20 ఏళ్లు పెద్ద సమయమే అయినప్పటికీ.. ప్రతీ నెల కేవలం 1000 పెట్టుబడితో ఉద్యోగ విరమణ తర్వాతే ఒకేసారి రూ. 5 లక్షలు రావడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..