Viral Photo: ఈ ఫోటోలోని భారత పారిశ్రామిక దిగ్గజం ఎవరో గుర్తుపట్టారా? మీ మెదడుకు మేత..

Viral Photo: ఈ ఫొటోలోని వ్యక్తి దిగ్గజ కంపెనీకి ఛైర్మన్. ఈ వ్యాపారవేత్త సోషల్ మీడియాలో చాలా ఉల్లాసంగా ఉంటుంటారు. అప్పుడప్పుడూ తన పాత చిత్రాలను(Old Image) సైతం పంచుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆయనెవరో మీరు గుర్తుపట్టారా..?

Viral Photo: ఈ ఫోటోలోని భారత పారిశ్రామిక దిగ్గజం ఎవరో గుర్తుపట్టారా? మీ మెదడుకు మేత..
Ratan Tata

Updated on: Mar 10, 2022 | 1:20 PM

Viral Photo: టాటా గ్రూప్ ఛైర్మన్, దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా(Ratan Tata) సోషల్ మీడియాలో చాలా ఉల్లాసంగా ఉంటుంటారు. అప్పుడప్పుడూ తన పాత చిత్రాలను(Old Image) సైతం పంచుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఆయన తన కాలేజీ రోజుల నాటి ఒక ఫోటోను ఫాలోవర్లతో పంచుకున్నాడు. ముంబయి, సిమ్లాలో చదువుకున్న తరువాత.. రతన్ టాటా 1955లో న్యూయార్క్ నగరంలోని రివర్‌డేల్ కంట్రీ స్కూల్ నుంచి తన విద్యను పూర్తి చేశారు. 82 ఏళ్ల రతన్ టాటా తన కళాశాల రోజుల చిత్రాలను #ThrowbackThursday హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కాలేజీ ఇయర్‌బుక్ ఫోటోను ఉంచారు.

Ratan Tata

కాలేజీ ఇయర్‌బుక్ లో రతన్ టాటాను ఫెయిర్లీ అమెరికన్, చామింగ్ అండ్ ఫ్రాంక్ అంటూ కొనియాడారు. రతన్ టాటా భారత్ నుంచి వచ్చారు. ఆయన అమెరికాలో చాలా మంది స్నేహితులను పొందారు. ఇక్కడ నివసించిన తక్కువ కాలంలోనే అమెరికన్ లా మారారు. ఆయన త్వరలోనే ఒక ఇంజనీర్ గా ఎదుగుతారని.. బేస్ బాల్ క్రీడలోనూ రాణిస్తారని రాశారు. ఇదే సమయంలో భారత దేశంలో తాను చదువుకున్న కళాశాలను రివర్ డేల్ తో సరిపోల్చారు. రివర్ డేల్ అనేది ఒక క్లిష్టమైన కళాశాల అని వర్ణించారు. రతన్ టాటా చేసిన ఈ ఆసక్తికరమైన పోస్టును మీరే చూసేయండి..

ఇవీ చదవండి..

Market Update: దలాల్ స్ట్రీట్ లో బుల్ రంకెలు.. ఎన్నికల ఫలితాల వేళ సూచీల జోరు..

Fixed Deposits: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు