Car loans: ఆ బ్యాంకుల్లో కార్ల లోన్లపై బంపర్ ఆఫర్లు.. ఇక కార్లకొనుగోదారులకు పండగే..!
పండగల సీజన్ వచ్చేసింది. వినాయక చవితి, విజయదశమి, దీపావళితో సందడి మొదలుకానుంది. ఈ పండగ సమయంలో ప్రతి ఒక్కరూ కొత్త వస్తువులను కొనటానికి ప్రణాళిక వేసుకుంటారు. ముఖ్యంగా మోటారు సైకిళ్లు, కార్లను కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. ఈ పండగల సీజన్ లో కార్ల కంపెనీలు వివిధ రకాల ఆపర్లను ప్రకటిస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేసి పండగ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకులు సైతం తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పాయి.
పండగల సీజన్ వచ్చేసింది. వినాయక చవితి, విజయదశమి, దీపావళితో సందడి మొదలుకానుంది. ఈ పండగ సమయంలో ప్రతి ఒక్కరూ కొత్త వస్తువులను కొనటానికి ప్రణాళిక వేసుకుంటారు. ముఖ్యంగా మోటారు సైకిళ్లు, కార్లను కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. ఈ పండగల సీజన్ లో కార్ల కంపెనీలు వివిధ రకాల ఆపర్లను ప్రకటిస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేసి పండగ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకులు సైతం తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పాయి. కొత్త కార్లను కొనుగోలు చేయడానికి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఐదేళ్ల కాలపరిమితితో రూ.ఐదు లక్షల రుణాన్ని 8.45 నుంచి 9 శాతం వడ్డీకి అందజేస్తున్నాయి. కొత్త కారు కొనుగోలు కోసం వివిధ బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. ఐదేళ్ల కాలపరిమితికి రూ.ఐదు లక్షలను అందిస్తున్నాయి. ఆగస్టు 14వ తేదీ నాటికి కారు రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో? ఓ లుక్కేద్దాం.
కారు లోన్లపై వడ్డీరేట్లు ఇలా
- యూకో బ్యాంకు కారు లోన్ పై 8.45 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.10,246 చెల్లించాలి.
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త కార్ల రుణాలపై 8.7 శాతం వడ్డీ విధిస్తున్నాయి. రుణగ్రహీతలు ప్రతినెలా రూ.10,307 చొప్పన వాయిదా చెల్లించాలి.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లు ఇస్తున్న రుణాలపై 8.75 శాతం వడ్డీ ఉంటుంది. ప్రతినెలా ఈఎంఐగా రూ.10,319 చొప్పున చెల్లించాలి.
- ఐడీబీఐ బ్యాంక్ లో కారు రుణానికి 8.8 శాతం వడ్డీ వసూలు చేస్తారు. నెలవారీ వాయిదా రూ. 10,331 ఉంటుంది.
- బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లు 8.85 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈఎంఐగా రూ. 10,343 చెల్లించాల్సి ఉంటుంది.
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొత్త కార్ లోన్‌పై 8.90 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తారు. ఇక్కడ రూ. 10,355 చొప్పున ఈఎంఐ కట్టాలి.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కారు రుణాలపై 8.95 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ప్రతినెలా రూ. 10,367 వాయిదా చెల్లించాల్సి ఉంటుంది.
- ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లో 9 శాతం వడ్డీ ఉంటుంది. ప్రతినెలా ఈఎంఐగా రూ.10,379 కట్టాలి.
- ఐసీఐసీఐ బ్యాంక్ లో 9.10 శాతం వడ్డీ, ఈఎంఐగా రూ. 10,403 చొప్పున వసూలు చేస్తారు.
- హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లో 9.20 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. రుణ గ్రహీతలు ఈఎంఐగా రూ. 10,428 చొప్పున కట్టాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..