సొంత కారు అనేది చాలా మంది మధ్యతరగతి కుటుంబాల కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి పొదుపు చేస్తూ ఉంటారు. పొదుపు చేసిన సొమ్ముకు నెలవారీ పద్ధతిలో చెల్లించేలా ఈఎంఐ ఆప్షన్‌తో కొంత అప్పు తీసుకుని కార్లు కొంటూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో కార్ల అమ్మకాల్లో స్పాట్ పేమెంట్ల కంటే ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసే కార్లు ఎక్కువ. అందువల్ల బ్యాంకులు కూడా కార్లపై లోన్లు ఇచ్చేందుకు ఆకర్షణీయ వడ్డీ రేట్లతో ముందుకు వస్తూ ఉంటాయి. భారతదేశంలో ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరగడంతో కొన్ని బ్యాంకులు 8.70 శాతం తక్కువకే కార్లపై రుణాలు అందిస్తున్నాయి. పైగా ఫ్లెక్సిబుల్ ఈఎంఐలతో పాటు గ్యారంటర్ అవసరం లేకుండా రుణాలను ఇస్తున్నాయి. అలాగే త్వరిత ప్రాసెసింగ్ ద్వారా కార్ల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. కాబట్టి పండుగ సీజన్‌లో ఏయే బ్యాంకులు తక్కువ వడ్డీకే కార్ల లోన్లు అందిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
ఈ బ్యాంకులో కార్ల లోన్లపై వడ్డీ రేటు 8.80 శాతంగా ఉంది. అలాగే జీరో ఫోర్‌క్లోజర్ ఛార్జీలతో పాటు త్వరితగతిన లోన్ ప్రాసెస్ చేశారు. అలాగే సౌకర్యవంతమైన ఈఎంఐలతో పాటు ఆకర్షించే పదవీ కాలలపై హెచ్‌డీ ఎఫ్‌సీ లోన్లను అందిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనవరి 31, 2024 వరకు కారు లోన్ తీసుకుంటే జీరో ప్రాసెసింగ్ ఫీజుతో అందిస్తారు. అలాగే అత్యల్ప వడ్డీ రేట్లతో పాటు ఏడు సంవత్సరాల సుదీర్ఘ రీపేమెంట్ వ్యవధితో ఉంటుంది. రిజిస్ట్రేషన్, బీమాతో సహా ‘ఆన్-రోడ్ ధర’ ఆధారంగా ఫైనాన్సింగ్ ఎస్‌బీఐ ప్రత్యేకత. వడ్డీ రోజువారీ తగ్గింపు బ్యాలెన్స్‌పై లెక్కిస్తారు. అయితే ఒక సంవత్సరం తర్వాత ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేకుండా లోన్లను అందిస్తున్నారు. కారు ‘ఆన్-రోడ్ ధర’లో 90 శాతం వరకు ఫైనాన్స్ ఇస్తూ అడ్బాన్స్ ఈఎంలు లేకుండా లోన్లను అందిస్తుంది. అలాగే కారు లోన్లపై ఐచ్ఛిక ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అందుబాటులో ఉంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఆన్-రోడ్ ధరలో 100 శాతం వరకు నిధులు సమకూరుతాయి. ఎంచుకున్న మోడల్‌లకు 8 సంవత్సరాల వరకు సౌకర్యవంతమైన పదవీకాలంలో లోన్లను అందిస్తారు. అలాగే ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్ల కోసం తక్షణ మంజూరును అందిసతారు. అయితే ఇప్పటికే ఉన్న ఆటో లోన్ కస్టమర్‌లు ఐమొబైల్ యాప్‌లో 3 సెకన్లలో ఇన్‌స్టా మనీను పొందవచ్చు. కారు లోన్ కోసం మీ ప్రస్తుత లోన్‌పై ఇన్‌స్టా రీఫైనాన్స్ ఉచితంగా పొందవచ్చు. గరిష్ట రీఫైనాన్స్ ఎంపిక మీ వాహనం విలువలో 140 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు. అలాగే లోన్లపై 12 నెలల తర్వాత ముందస్తు చెల్లింపు (ఫోర్‌క్లోజర్) ఛార్జీలపై మినహాయింపును అందిస్తున్నారు.
ఫెడరల్ బ్యాంక్ ఎక్స్-షోరూమ్ ధరలో 100 శాతం లోన్‌ను అందిస్తుంది. అలాగే 84 నెలల వ్యవధితో ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. అలాగే రుణగ్రహీతకు రూ.10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రీ క్లోజర్ చార్జీలు లేకుండా లోన్లను అందిస్తారు. అలాగే కారు కొనుగోలు తేదీ నుండి 1 నెలలోపు రీయింబర్స్‌మెంట్. ఆదాయ ధ్రువపత్రం లేకుండా లోన్‌ను మంజూరు చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..