Post Office Customers: వినియోగదారులకు పోస్టాఫీసు గొప్ప సౌకర్యాన్ని అందిస్తోంది. ఇప్పుడు మీరు పోస్టాఫీసుకు వెళ్లకుండానే నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేరవచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ పోస్ట్‌ల శాఖ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఇది భారత ప్రభుత్వం స్వచ్ఛంద పెన్షన్ పథకం. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నిర్వహిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు ఏప్రిల్ 26, 2022 నుంచి ఆన్‌లైన్ మోడ్ ద్వారా NPS సభ్యత్వాన్ని అందించడం ప్రారంభించింది. ఇప్పుడు 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్‌సైట్ లో నేషనల్ పెన్షన్ సిస్టమ్-ఆన్‌లైన్ సర్వీసెస్ మెనుని సందర్శించడం ద్వారా ఈ పథకంలో చేరవచ్చు.
NPS ఆన్‌లైన్ కింద తాజా రిజిస్ట్రేషన్, ప్రారంభ సహకారం, SIP ఎంపిక వంటి సౌకర్యాలు వినియోగదారులకు కనీస ఛార్జీలతో అందుబాటులో ఉంటాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ తన ఎన్‌పిఎస్ సర్వీస్ ఛార్జ్ అత్యల్పమని పేర్కొంది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే పథకం NPS. నిబంధనల ప్రకారం ఎవరైనా 60 ఏళ్లు లేదా రిటైర్మెంట్ కంటే ముందు NPS నుంచి డబ్బును విత్‌డ్రా చేయలేరు. కానీ అత్యవసర పరిస్థితుల్లో మీరు ఈ పెన్షన్ ఫండ్ నుంచి డబ్బు పొందగలిగే పరిస్థితులు ఉన్నాయి.
ఎన్‌పిఎస్‌లో ఒక సంవత్సరంలో కనీసం రూ.1,000 జమ చేయాలి. రూ. NPSలో టైర్ 1, టైర్ 2 అనే రెండు రకాల ఖాతాలు ఉంటాయి. టైర్ 1 అనేది పూర్తి రిటైర్మెంట్ ఖాతా. దీని నుంచి 60 సంవత్సరాల కంటే ముందు డబ్బును విత్‌డ్రా చేయలేరు. మరోవైపు టైర్ 2 ఖాతా ఇది మీకు విత్ డ్రా సౌకర్యాన్ని అందిస్తుంది. ఖాతాను తెరవడానికి మీకు తప్పనిసరిగా మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడి, నెట్ బ్యాంకింగ్ సదుపాయంతో యాక్టివ్ బ్యాంక్ ఖాతా ఉండాలి. ఇంట్లో కూర్చొని NPS ఖాతాలో డిపాజిట్లు చేయవచ్చు.
ఒక వ్యక్తి NPS నుంచి తప్పుకోవాలనుకుంటే కొన్ని షరతులు ఉన్నాయి. PFRDA ప్రకారం.. NPS లాక్-ఇన్ వ్యవధి 5 నుంచి 10 సంవత్సరాలు. ఒక సభ్యుడు NPS ఖాతాను మూసివేయాలనుకుంటే ఖాతాను ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేయవచ్చు. స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు ఈ నియమం వర్తిస్తుంది. మీరు జీతం తీసుకునే వ్యక్తులు అయితే మీరు 10 సంవత్సరాల పాటు ఖాతాను కొనసాగించాలి. ఆ తర్వాత మాత్రమే మీరు ఖాతాను మూసివేయవచ్చు. దీనిని ప్రీ-మెచ్యూర్ ఎగ్జిట్ అంటారు.
మరిన్ని బిజినెస్ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి