
ప్రపంచంలో అత్యంత సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్ ఎవరు అని పెట్టుబడుల గురించి కాసింత నాలెడ్జ్ ఉన్న ఎవరైనా చెప్పేస్తారు.. వారెన్ బఫెట్ అని. 95 ఏళ్ల బఫెట్ 1988లో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పటికీ అతనికి అపారమైన లాభాలను తెస్తోంది. కేవలం ఒక్క స్టాక్ నుంచే అతను ప్రతి ఏటా రూ.6,800 కోట్లు సంపాదిస్తాడు.
బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే 1988లో కోకా-కోలాలో సుమారు 1.3 బిలియన్ డాలర్లు (ఆ సమయంలో సుమారు రూ.108 కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఆ సమయంలో చాలా మంది విమర్శకులు అతన్ని ఎగతాళి చేశారు. అది కేవలం చక్కెర పానీయాలు అమ్మే కంపెనీ అని అన్నారు. కానీ బఫెట్ నిరుత్సాహపడలేదు. షేర్లను అమ్మే బదులు, అతను మరిన్ని కొనుగోళ్లు కొనసాగించాడు. ఫలితంగా బఫెట్ ప్రతి సంవత్సరం కోకా-కోలా నుండి సుమారు 816 మిలియన్ డాలర్లు (రూ.6,800 కోట్లు)కు పైగా డివిడెండ్‌లను పొందుతున్నాడు.
యాహూ ఫైనాన్స్ ప్రకారం.. 1987 మార్కెట్ పతనం తర్వాత పెట్టుబడిదారులు భయాందోళనలకు గురవుతున్నప్పుడు బఫెట్ కోకా-కోలా షేర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. కంపెనీ ప్రపంచ బ్రాండ్ విలువ, క్రమంగా పెరుగుతున్న లాభాలు, బలమైన నగదు ప్రవాహంపై అతను నమ్మకంగా ఉన్నాడు. 1990ల ప్రారంభం నాటికి, బఫెట్ దాదాపు 400 మిలియన్ షేర్లను సేకరించాడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి