బడ్జెట్ సమయం ఆసన్నమైంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన పద్దుల చిట్టాను సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీనే పార్లమెంట్లో బడ్జెట్ 2023 ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక నిపుణులు, పెట్టుబడి దారులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో రైల్వే శాఖకు సంబంధించిన కేటాయింపులపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త రైళ్లు, కొత్త చార్జీలు, కొత్త సౌకర్యాలు వంటివి ప్రకటించే అవకాశం ఉంది. ప్రీ బడ్జెట్ మీటింగ్ రైల్వే బోర్డు తమకు 25 నుంచి 30 శాతం వరకూ బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేసింది. ఈక్రమంలో కేంద్ర రైల్వే బడ్జెట్ రూ. 1.4 ట్రిలియన్ల నుంచి రూ. 2 ట్రిలియన్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే బడ్జెట్ లో ఉండే ప్రతిపాదనలపై నిపుణులు చెబుతున్న అంశాలు మీకోసం..
గతంలో రైల్వే శాఖకు ప్రత్యేక బడ్జెట్ ఉండేది. దాని కేటాయింపులు అంతా ప్రత్యేకంగా ప్రకటించే వారు. అయితే 2007 లో నీతిఆయోగ్ సూచనల మేరకు రైల్వే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ లో విలీనం చేశారు. అప్పటి నుంచి మొత్తం కలిపి ఒకటే బడ్జెట్ గా ప్రకటిస్తున్నారు.
వచ్చే బడ్జెట్ లో రైల్వేకు సంబంధించి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కు అధికంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త లైన్ల నిర్మాణం, లైన్ల గేజ్ లు మార్చడం, ఎలక్ట్రిఫికేషన్ చేయడం, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తేవడం వంటివి ఉండే అవకాశం ఉంది. అంతేకాక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక సౌకర్యాలను కల్పించేందుక ప్రణాళిక చేస్తున్నారు.
బడ్జెట్ లో మరిన్ని వందేభారత్ ట్రైన్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటిలో బెర్త్ లు కలిగిన వందేభారత్ ట్రైన్లను కూడా తీసుకొచ్చే ఆలోచన కేంద్రం చేస్తోంది. ఇప్పటి వరకూ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ మాత్రమే వందే భారత్ ట్రైన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇకపై రాజధాని ఎక్స్ ప్రెస్ మోడల్లో వందేభారత్ ట్రైన్లలో కూడా ఏసీ స్లీపర్ కోచ్లను తీసుకొచ్చే ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. దాదాపు 100కు పై గా ఇలాంటి ట్రైన్లను దేశ వ్యాప్తంగా నడపాలని యోచన చేస్తోంది.
అహ్మదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ కూడా నడపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టును వచ్చే బడ్జెట్ లో ప్రవేశం పెట్టే అవకాశం ఉంది. దీని కోసం కొంత నిధులు కేటాయించే చాన్స్ ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..