Budget 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 2022-23 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో వివిధ వర్గాల వారికి మేలు కలిగించే బడ్జెట్ ఉంది. ఆదాయపు పన్ను మినహాయింపులను, పన్ను రేట్ల తగ్గింపు కోరుకుంటున్న కోట్లాది మందికి తీపి కబురు అందించారు మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సంవత్సరం కూడా ఆదాయపు పన్నులలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే కరోనా వైరస్ బారిన పడిన కుటుంబాలకు మాత్రం కేంద్రం ఊరట కలిగించింది. కరోనాతో ఏ వ్యక్తి మరణించినా.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు అందుకునే రూ.10 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.రూ.10 లక్షలు దాటినట్లయితే ఆ ఆదాయం పన్ను పరిధి కిందకు వస్తుందని పేర్కొన్నారు.
ఒక వైపు కరోనా, మరో వైపు ఒమిక్రాన్ వైరస్ ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కరోనా బారి నుంచి ప్రజలను బయటపడేసి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్రం. కోవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి కంపెనీల నుంచి పరిహారాలు, క్రౌడ్ ఫండింగ్, ఇతర వనరుల రూపంలో ఆదాయాలు వస్తుంటాయి. ఇలా కరోనాతో మరణించి వ్యక్తి కారణంగా పరిహారం అందుకున్న కుటుంబ సభ్యులకు ఊరట కలిగించింది కేంద్రం.
ఇవి కూడా చదవండి: