Mobile Tower Installing: ఇంటి పైకప్పుపై టవర్‌ ఏర్పాటుకు BSNL ప్రతి నెలా రూ.50 వేలు ఇస్తుందా?

|

Jan 06, 2025 | 9:36 PM

Mobile Tower Installing: ఈ రోజుల్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. అమాయకులను ఆసరా చేసుకుంటున్న నేరగాళ్లు సులభంగా మోసగిస్తున్నారు. అయితే కొందరు ఇంటిపైకప్పుపై మొబైల్‌ టవర్స్‌ను ఏర్పాటు చేస్తామని, అందుకు డబ్బులు ఇస్తామని మోసగిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొందరు నకిలీ వెబ్‌సైట్లను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి నమ్మవద్దని బీఎస్‌ఎన్‌ఎల్‌ చెబుతోంది..

Mobile Tower Installing: ఇంటి పైకప్పుపై టవర్‌ ఏర్పాటుకు BSNL ప్రతి నెలా రూ.50 వేలు ఇస్తుందా?
Follow us on

భారత ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ప్రజలకు ఓ హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్‌ పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌ దూసుకుపోతోంది. ఈ వెబ్‌సైట్‌లో తప్పుడు సమాచారం వల్ల ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందంటుంది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఈ వెబ్‌సైట్ పేరు https://bsnltowersite.in/. ఇది తమ వెబ్‌సైట్ కాదని కంపెనీ చెబుతోంది. ఈ వ్యక్తులు తమ ఇంటిపై టవర్‌ను ఏర్పాటు చేస్తామని, బదులుగా డబ్బు ఇస్తామని ప్రజలకు చెబుతారు. అయితే, వాస్తవానికి వారు వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి దబ్బులు దండుకోవడం కోసమే ప్లాన్‌.

ఈ నకిలీ వెబ్‌సైట్ గురించి బీఎస్ఎన్ఎల్ హెచ్చరిక జారీ చేసింది. ఈ వెబ్‌సైట్ తమది కాదని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎక్స్-పోస్ట్‌లో పేర్కొంది. తాజా అప్‌డేట్‌ల కోసం తన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా ప్రజలను కోరుతోంది. ఈ వెబ్‌సైట్ గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాలకు మూడు విభిన్న ప్యాకేజీలను అందిస్తుంది. ఈ ప్యాకేజీలలో రూ.18 లక్షల వరకు ముందస్తు పెట్టుబడి, రూ.25,000 నుండి రూ.55,000 వరకు నెలవారీ చెల్లింపులు ఉంటాయని చెబుతోంది. ఇలాంటివి అన్ని కూడా నకిలీవే.

ఇలాంటి న్యూస్‌ను నమ్మి మోసపోకండి అంటూ కంపెనీ హెచ్చరిస్తోంది. నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించడానికి, మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముందుగా, వెబ్‌సైట్ చిరునామా https://తో ప్రారంభమవుతుందని, ఇది సరైనది. ఇలా లేకపోతే అది నకిలీ వెబ్‌సైట్‌ అని గుర్తించుకోవాలి. నకిలీ వెబ్‌సైట్‌ల అక్షరాలలో స్వల్పంగా తప్పులు ఉంటాయి. ఆ తప్పులను గుర్తించలేని విధంగా ఉంటాయి. కంపెనీలకు సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయా లేదా అని కూడా చూడండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Tech Tips: మీ ఫోన్‌ పదేపదే వేడెక్కుతుందా..? మీరు ఈ పొరపాట్లు చేస్తున్నట్లే..!

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి